Richa Pallod: విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తరుణ్ రీచా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం నువ్వే కావాలి.ఈ సినిమా విడుదలై దాదాపు 22 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ ఈ సినిమా టీవీలలో ప్రసారం అయితే కళ్ళు ఆర్పకుండా చూస్తారు. అంతగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పాలి. ఈ సినిమాతో హీరోగా తరుణ్ హీరోయిన్ గా రీచా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రిచా అనంతరం పలు అడపాదడపా సినిమాలలో నటించారు.ఇక ఈమె చివరిసారిగా 2016వ సంవత్సరంలో ఆది పినిశెట్టితో కలిసి మలుపు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ప్రస్తుతం పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా ఈమె ఇండస్ట్రీకి దూరం అయ్యి ప్రస్తుతం ఎక్కడ ఉంది ఏం చేస్తుందనే విషయానికి వస్తే…
రిచా 2011 వ సంవత్సరంలో హిమాన్షు బజాజ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఇలా వివాహమైనప్పటికీ ఈమె 2016వ సినిమాలో మలుపు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.హిమాన్షు అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న అనంతరం ఈమె పూర్తిగా కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ ఇంటి పట్టునే ఉన్నారు. ప్రస్తుతం ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నారు.
భర్త వ్యాపారాలతో బిజీగా మారిన రీచా…
ఇలా రీచా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. తన భర్త వ్యాపారాలలో చేదోడు వాదోడుగా ఉంటూ తన కుటుంబ బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్న రీచా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యామిలీకి సంబంధించిన అన్ని విషయాలను వారి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన తన ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…