Categories: FeaturedMovie News

Shivani Rajasekhar: హీరో రాజ్ తరుణ్ ప్రేమలో శివాని రాజశేఖర్… వార్తలపై శివాని రియాక్షన్ ఇదే?

Shivani Rajasekhar:టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాజశేఖర్ జీవిత వారసురాళ్లుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు శివాని, శివాత్మిక. ఇలా వీరిద్దరూ ఇండస్ట్రీలో పలు సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ హీరోయిన్లుగా గుర్తింపు పొందడం కోసం ఎంతో కష్టపడుతున్నారు.

ఇకపోతే ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెలెబ్రెటీల గురించి నిత్యం ఏదో ఒక వార్తలు రావడం సర్వసాధారణం ఈ క్రమంలోనే గతంలో శివాని శివాత్మిక గురించి కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వీళ్ళు తమ బాయ్ ఫ్రెండ్ తో దుబాయ్ వెళ్లిపోయారంటూ వార్తలు రాగా ఈ వార్తలపై స్పందించి అసలు విషయాన్ని తెలియజేస్తూ క్లారిటీ ఇచ్చారు.

ఇకపోతే తాజాగా శివాని రాజశేఖర్ హీరో రాజ్ తరుణ్ తో కలిసి ఆహనా పెళ్ళంట అనే వెబ్ సిరీస్ లో నటించారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ జీ 5 లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇలా వీరిద్దరూ కలిసి వెబ్ సిరీస్ లో నటించడంతో వీరి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. హీరోయిన్ శివాని రాజ్ తరుణ్ ప్రేమలో ఉన్నారనీ వార్తలు షికార్లు చేస్తున్నాయి.

ప్రపంచ యుద్ధాలు జరుగుతాయి…

ఈ క్రమంలోనే ఈ వార్తలపై శివాని స్పందించి క్లారిటీ ఇచ్చారు. రాజ్ తరుణ్ తో తాను ప్రేమలో ఉన్నానని వచ్చే వార్తలలో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. తను నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఈమె సమాధానం చెప్పారు. ఇలా మా మధ్య మంచి ఫ్రెండ్షిప్ తప్ప ఎలాంటి ప్రేమలు లేవని ఒకవేళ మేమిద్దరం కనుక పెళ్లి చేసుకుంటే ప్రపంచ యుద్ధాలు జరుగుతాయి అంటూ తన గురించి వచ్చిన వార్తలపై ఈమె ఫన్నీగా సమాధానం చెప్పారు. ఇలా తన గురించి హీరో రాజ్ తరుణ్ గురించి వచ్చినటువంటి వార్తలకు శివాని రాజశేఖర్ చెక్ పెట్టారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago