Movie News

Richest Hero : సౌత్ ఇండియాలోనే రిచెస్ట్ హీరో ఎవరో తెలుసా? ఆయన ఆస్తులు చూస్తే షాక్ అవుతారు!

Richest Hero : సాధారణంగా ఇండియాలో అత్యంత ధనవంతులైన సినీ సెలబ్రిటీల గురించి మాట్లాడేటప్పుడు అందరూ బాలీవుడ్ హీరోలు, హీరోయిన్ల పేర్లే చెబుతుంటారు. నిజానికి వారి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతుంటాయి. కానీ గత కొన్నేళ్లుగా సీన్ పూర్తిగా మారిపోయింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలు హిందీ బెల్ట్‌లో కూడా దుమ్మురేపుతున్నాయి. దీంతో మన సౌత్ హీరోలకు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అంతేకాదు రెమ్యునరేషన్ విషయంలోనూ ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సినిమాలతో సంబంధం లేకుండా సౌత్ ఇండియాలో రిచెస్ట్ యాక్టర్‌గా ఎదిగిన ఒక తెలుగు హీరో ఉన్నాడు. ఆయన ఆస్తుల విలువ ఏకంగా రూ.3,572 కోట్లు. ఆ హీరో ఎవరో కాదు మన టాలీవుడ్ కింగ్ నాగార్జున.

శివ సినిమాతో తెలుగు చిత్రసీమలో ఒక సంచలనం సృష్టించి, మన్మథుడిగా యువత మనసు దోచుకున్నాడు అక్కినేని నాగార్జున. దాదాపు 70కి పైగా తెలుగు సినిమాల్లో నటించి, తన నటనతో ఎంతోమంది అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. యంగ్ సామ్రాట్‌గా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతున్నాడు. ఇప్పటికీ సినిమాలు, బిగ్ బాస్ రియాలిటీ షోలతో బిజీగా ఉన్నాడంటే ఆయనకున్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే నాగార్జున కేవలం సినిమాల్లోనే కాదు బిజినెస్‌లో కూడా రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఏకంగా రూ.3,500 కోట్లకు అధిపతిగా నిలిచి దక్షిణాదిలో రిచెస్ట్ యాక్టర్‌గా తన సత్తా చాటుతున్నాడు.

మిగతా హీరోలంతా నాగార్జున తర్వాతే.. మనీకంట్రోల్ వెబ్‌సైట్ ప్రకారం నాగార్జున నికర సంపద 410 మిలియన్ డాలర్లు. అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు రూ.3,572 కోట్లు. బాలీవుడ్‌లో టాప్ స్టార్స్‌గా వెలుగొందుతున్న అమితాబ్ బచ్చన్ (రూ.3,200 కోట్లు), హృతిక్ రోషన్ (రూ.3,100 కోట్లు), సల్మాన్ ఖాన్ (రూ.2,900 కోట్లు), అక్షయ్ కుమార్ (రూ.2,700 కోట్లు), ఆమిర్ ఖాన్ (రూ.1,900 కోట్లు) వంటి వారిని కూడా నాగార్జున అధిగమించాడు. అంతేకాదు మన తెలుగు హీరోలైన చిరంజీవి (రూ.1,650 కోట్లు), రామ్‌చరణ్ (రూ.1370 కోట్లు), రజనీకాంత్ (రూ.500 కోట్లు), జూనియర్ ఎన్టీఆర్ (రూ.500 కోట్లు), ప్రభాస్ (రూ.250 కోట్లు) కూడా నాగార్జున వెనకే ఉన్నారు.

నాగార్జున సంపాదన వెనుక అసలు రహస్యం ఏమిటి? నాగార్జున ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించాడు. ఆయన సంపాదనలో సినిమా రెమ్యునరేషన్ ఒక భాగం మాత్రమే. దీనితోపాటు వివిధ బిజినెస్ వెంచర్ల ద్వారా కూడా ఆయనకు ఆదాయం వస్తుంది. ప్రముఖ ఫిల్మ్ ప్రొడక్షన్ బ్యానర్ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios)కు నాగార్జున ఓనర్. అంతేకాదు రియల్ ఎస్టేట్, స్పోర్ట్స్ ఫ్రాంఛైజీలలో కూడా ఆయన పెట్టుబడులు పెట్టాడు. N3 Realty Enterprises అనే రియల్ ఎస్టేట్ మరియు నిర్మాణ సంస్థ కూడా ఆయనదే. కేవలం రియల్ ఎస్టేట్ ఆస్తుల విలువ సుమారు రూ.900 కోట్లు ఉంటుందని దైనిక్ భాస్కర్ రిపోర్ట్ వెల్లడించింది. నాగార్జునకు 3 స్పోర్ట్స్ ఫ్రాంఛైజీలు, ఒక ప్రైవేట్ జెట్, అర డజనుకు పైగా లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago