Viral News : ప్రేమకు కులం, మతం, డబ్బు, హోదా అస్సలు అవసరం లేదని ఈ జంట నిరూపించింది. ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ కిశ్వర్ సాహిబా తన ఆసుపత్రిలో పనిచేసే హౌస్ కీపింగ్ అబ్బాయి షెహజాద్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ రోజుల్లో అబ్బాయికి డబ్బు, హోదా, చదువు ఉంటేనే అమ్మాయిలు ఇష్టపడతారు. కానీ కిశ్వర్ మాత్రం షెహజాద్ స్వచ్ఛమైన మనసును చూసి ప్రేమించింది. నిజమైన ప్రేమ అంటే ఇదేనేమో అనిపిస్తుంది కదా!
హైదరాబాద్‌లో నివసిస్తున్న డాక్టర్ కిశ్వర్ సాహిబా, షెహజాద్‌లది నిజంగా ఒక అద్భుతమైన ప్రేమ కథ. డాక్టర్ కిశ్వర్ హైదరాబాద్‌లో ఎంబీబీఎస్ డాక్టర్‌గా పనిచేస్తోంది. షెహజాద్ అదే ఆసుపత్రిలో హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేస్తున్నాడు. అయితే మొదటి చూపులోనే షెహజాద్‌ను చూసి కిశ్వర్ మనసు పారేసుకుంది. వెంటనే అతడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో కూడా పంచుకుంది.
అసలు విషయం ఏమిటంటే.. షెహజాద్‌ను మొదటిసారి చూసినప్పుడు అతడు ఆమెకు క్లీనర్ లేదా “ఛాయ్‌వాలా” లాగా కనిపించలేదట. అతడి పని పట్ల శ్రద్ధ, నిబద్ధత, నిరాడంబరమైన మనస్తత్వం ఆమెను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అతడు క్లీనింగ్ చేసే స్టైల్ అంటే ఆమెకు చాలా ఇష్టమట. అందుకే ప్రేమలో పడిపోయింది.
ఆ తరువాత కిశ్వర్ తన ప్రేమను షెహజాద్‌కు చెప్పింది. కానీ డాక్టర్ అయిన కిశ్వర్ తనను ప్రేమిస్తుందని షెహజాద్ మొదట షాక్ అయ్యాడు. ఆమె నుంచి తప్పించుకోవడానికి కూడా ప్రయత్నించాడు. సమాజంలో తన స్థానం ఏంటి, ఆమె స్థానం ఏంటి అని ఆలోచించి భయపడ్డాడు. కానీ కిశ్వర్ ప్రేమలోని నిజాయితీని అర్థం చేసుకున్న షెహజాద్ ఆమె ప్రేమను అంగీకరించాడు. కిశ్వర్ తన జీవితంలోకి రావడం తన అదృష్టంగా భావించాడు.
ఈ ప్రేమకథ నిజంగా చాలా స్పెషల్ కదా! ప్రేమకు ఎలాంటి బంధనాలు ఉండవని ఈ జంట నిరూపించింది. కిశ్వర్, షెహజాద్‌ల బంధం ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుందాం!
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…