RK Selvamani : తమిళ సినీ పరిశ్రమకు చెందిన అగ్ర హీరోలు రజనీకాంత్ విజయ్ అజిత్ వంటివారు తమ సినిమాలకు సంబంధించిన షూటింగ్ లను తమిళనాడులో కాకుండా తెలుగురాష్ట్రాల అయినా హైదరాబాద్, వైజాగ్ లో జరుపుకుంటున్నారు. దీనివలన తమిళ సినీ పరిశ్రమకు చెందిన కార్మికులు ఎంతగానో నష్టపోతున్నారు అని సౌత్ ఇండియన్ ఫిల్మ్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి స్పందించారు.
తమిళ్ సినిమా షూటింగ్ లు తమిళనాడులోనే జరగాలి….
దీనికి సంబంధించి చెన్నైలోని వడపళని లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన ఇలా మాట్లాడారు.. కోలీవుడ్ అగ్రహీరోలు తమ షూటింగ్ లో ఇతర రాష్ట్రాల్లో చేసుకోవడం వల్ల తమిళ సినీ పరిశ్రమకు చెందిన కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు అని, తమిళ సినిమా షూటింగ్ లు తమిళనాడు లోనే జరగాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఈ విషయాన్ని ఇప్పటికే రజనీకాంత్ విజయ్ లతో చర్చించామని వారు ఈ విషయంపై సానుకూలంగా స్పందించారని ఆయన తెలియజేశారు. నటుడు అజిత్ కుమార్, దర్శకుడు వినోద్, నిర్మాత బోనీకపూర్ లకు విజ్ఞప్తి చేస్తూ.. గతంలో నిర్మించిన కొన్ని పెద్ద సినిమాలు రెవెన్యూలో తమిళనాడుకు వచ్చింది ఏమీ లేదు ఆదాయం మీకు, రెవిన్యూ రెండు తెలుగు రాష్ట్రాలకు పోయింది.
సినిమా నిర్మాణానికి కావలసిన అన్ని సౌకర్యాలు తమిళనాడులో ఉన్నాయి. అంతే కాకుండా సినీ నిర్మాణానికి అవసరమయ్యేలా 15 ఎకరాలకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించి ఏర్పాటు చేసింది. కనుక నటుడు అజిత్ కూడా త్వరలోనే ఒక మంచి నిర్ణయం తీసుకొని తమిళ సినీ పరిశ్రమకు చెందిన వేలాది మంది కార్మికులను ఆదుకోవాలని ఫెప్సీ అధ్యక్షుడు ఆర్ కె సెల్వమణి మీడియా సమావేశంలో తెలియజేశారు.
అయితే వారి సినిమా షూటింగ్ ఎవరితోనైనా చేయించుకునే అధికారం నిర్మాతలకు ఉంటుందనే సినీ నిర్మాతల సంఘం ప్రకటన విడుదల చేసినట్టు నా దగ్గర ఎటువంటి సమాచారం లేదు అని అయన అన్నారు. అయితే సినీ నిర్మాతల సంఘం ఫెప్సీ మధ్య సమన్వయ లోపాలు ఉన్నాయని, అయితే సినీ పరిశ్రమకు చెందిన కార్మికుల వేతనాల గురించి ఇప్పటికే నిర్మాత మండలితో చర్చించామని, ఈరోజు ఉదయం మళ్లీ వారితో చర్చలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై నిర్మాత మండలి సానుకూలంగా స్పందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తపరిచారు.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…