Featured

Vishwak Sen : నన్ను ఎవడు ఏమి పీకలేడు.. ప్రీ రిలీజ్ వేడుకలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విశ్వక్ సేన్..!

Vishwak Sen intresting comments : విశ్వక్ సేన్ తన సినిమా పబ్లిసిటీ కోసం చేసిన ఒక ప్రాంక్ వీడియో గాడితప్పి విమర్శల పాలైన సంగతి తెలిసిందే. చివరకు ఈ వివాదం టీవీ9 స్టూడియో లో మరో మలుపు తిరిగిన సంగతి కూడా అందరికీ తెలుసు.టీవీ 9 న్యూస్ రీడర్ దేవి నాగవల్లి సుసైడ్ ప్రాంక్ పై డిబేట్ చేస్తూ అందులో విశ్వక్ ను పాగల్ శీను, డిప్రెషన్ పర్సన్ అంటూ వ్యక్తిగతంగా దూషించడం జరిగింది. అందుకు విశ్వక్సేన్ సరిగా మాట్లాడండి అనడం దేవి నాగవల్లి గెట్ అవుట్ అంటూ అరవడంతో విశ్వక్ ఎఫ్ పదంతో బూతులు కూడా మాట్లాడాడు. అయితే ఈ విషయం సోషల్ మీడియా లో బాగా వైరల్ అవ్వడం ఇంకా పలువురు సెలెబ్రేటీలు ఇద్దరికీ మద్దతుగా మాట్లాడటం జరుగుతోంది. ఈ విషయంపై టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ను కలిసి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా విశ్వక్సేన మీద కొంతమంది మహిళా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామంలో హీరో విశ్వక్ సేన్ తన సినిమా అయిన అశోక వనంలో అర్జున కళ్యాణం ప్రీ రిలీజ్ వేడుకను పురస్కరించుకొని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రీ రిలీజ్ వేడుకలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విశ్వక్ సేన్….

అశోకవనంలో అర్చన కళ్యాణం సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ..హీరో గా తన ప్రయాణం ప్రారంభం కాక ముందు నుంచి తనకు మద్దతు ఇచ్చిన వారి అమ్మ గారిని విశ్వక్ సేన్ గుర్తు చేసుకున్నారు. ఆమెకు ఐలవ్యూ చెప్పారు. ”ఎవరి కుటుంబంలో అయినా ఒక అబ్బాయి వచ్చి సినిమా హీరో అవుతారని అంటే అందరూ షాక్ అవుతారు, వద్దు అనే అంటారు. కానీ మా అమ్మ మొదటి నుంచి నన్ను నమ్మింది. నాపై నమ్మకం పెట్టుకుంది. అలాగే,మా నాన్నగారు కూడా! మా అమ్మ ఏదయినా హిట్ సినిమా చూసిన ప్రతిసారి నాకు ఫోన్ చేసి… ‌‌’నీ సినిమా ఎప్పుడు?’ అని అడిగేది. అప్పటికీ ఇంకా నేను ఒక్క సినిమా కూడా చేయలేదు. షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఉండేవాడిని. నన్ను ఎంతగానో నమ్మిన అమ్మకు ఐ లవ్ యు” అంటూ… ఎమోషనల్ అయ్యారు.

తను హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన అప్పటి నుంచి ఎంత కష్టపడినది, ‘వెళ్ళిపోమాకే’ సినిమా తో తన కెరీర్ ప్రారంభించిన సంగతి ప్రస్థావించారు. తర్వాత తనపై నమ్మకం ఉంచి ఈ నగరానికి ఏమైంది సినిమా తీసిన తరుణ్ భాస్కర్ కి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా ‘నాకు తెలిసి ఎదుగుదల అంటే… ఒక సమస్య వచ్చినప్పుడు, అది మనకు ఎదురైనప్పుడు వెళ్లి ఇంట్లో కూర్చోవడం కాదు. సమస్య ఎక్కడ ఉన్నా… ఇలా ఖమ్మం వచ్చి ప్రేక్షకుల ముందు నిలబడి, చిరునవ్వుతో మాట్లాడటం. నేను ఎప్పుడు నన్ను ఎవరో ఏదో అన్నారని, నాకు ఏదో జరిగిందని, నా వైపు వేలు చూపించారని బాధ పడలేదు” అని యువ హీరో విశ్వక్ సేన్ అన్నారు.

అయితే దేవి నాగవల్లి తో వివాదం పై ప్రీ రిలీజ్ వేడుకలో విశ్వక్ సేన్ స్పందించారు. తాను చాలా చూశానని, తనకు ఇదేమీ కొత్త కాదని ఆయన అన్నారు. ”నేను అమ్మాయిలకు గౌరవం ఇవ్వనని అంటున్నారు. నేను ఆ అమ్మాయికి గౌరవం ఇచ్చినాను కనుకనే … నోరు మూసుకుని వెళ్లిపోయను. అమ్మా… నువ్వు నీ కొడుక్కి నేర్పించిన సంస్కారం అందరికీ తెలుసు.ఇపుడు అందరూ చూశారు. వాళ్ళందరూ నాతో పాటు ఉన్నారు. నేను ఒక్కటి చెబుతున్నా… నిజంగానే నాకు బ్యాక్ గ్రౌండ్ లేదు. ఎక్కడి నుంచో ఒకడినే వచ్చాను. ఇండియా అనే ఇంత పెద్ద సినిమా ఇండస్ట్రీలో ఒక చిన్న ఈగ లాంటివాడిని నేను. నలుగురు కలిసి కొడితే పడిపోతానేమో! కానీ, నలుగురు కలిసి కొట్టడానికి నా చుట్టూ ప్రేక్షకులు అనే ఒక పెద్ద కవచం ఉంది. సోషల్ మీడియాలో నాకు లభిస్తున్న మద్దతు చూసి… నేను సంపాదించిన ఆస్తి ఇది అని అనుకుంటున్నాను. నన్ను ఎవరు ఏమి పీకలేని ఆస్తి. ఎవరు లాక్కోలేని ఆస్తి. ‘ఏం చూసుకుని నీకు అంత పొగరు?’ అంటే… నాకు ఉన్నారు. సందేహాలుంటే #VishwakSen అని సోషల్ మీడియాలో సెర్చ్‌ చేయండి” అని విశ్వక్ సేన్ ఆసక్తికరంగా మాట్లాడారు. 

Bhargavi

Recent Posts

టికెట్ పెంపుపై దుమారం… చివరకు తగ్గిన దేవస్థానం!

శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…

3 hours ago

52లోనూ ఫిట్‌గా ఆమని.. రోజూ ఇదే రూటీన్ అంటోంది హీరోయిన్

తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్‌గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…

3 hours ago

నైటీ వేసుకుందన్న కోపం.. భార్యపై నిప్పంటించిన భర్త

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…

13 hours ago

సైన్స్ vs నమ్మకాలు.. పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…

13 hours ago

మెగాస్టార్ ఇంటి పక్కనే అల్లు అర్జున్ కలల గృహం.. రూ.80 కోట్ల మేన్షన్ నిర్మాణం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…

13 hours ago

నాదెండ్ల భాస్కర్ రావు ఇకలేరు.. విభిన్న రాజకీయ ప్రయాణం ముగిసింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…

14 hours ago