Featured

Babu Gogineni supports Vishwak Sen : విశ్వక్ కు అండగా నిలిచిన బాబు గోగినేని.. వైరల్ అవుతున్న పోస్ట్..!

Babu Gogineni supports Vishwak Sen : టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి, హీరో విశ్వక్ సేన్ మధ్య వివాదం రోజురోజుకు పెరుగుతోంది. ఈ విషయమై దేవి నాగవల్లి సినిమాటోగ్రఫీ మంత్రి అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కంప్లైంట్ చేయగా, అటు విశ్వక్ సేన్ నిన్న అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఈ వివాదాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడటం, ఇలా ఈ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. అంతేకాకుండా ఈ వివాదంలో కొంతమంది విశ్వక్ సేన్ కు సపోర్ట్ చేస్తుంటే మరి కొంత మంది దేవి నాగవల్లి కి సపోర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా లో అంతా ఈ వివాదానికి సంబంధించిన రచ్చ నే సాగుతోంది. అయితే తాజాగా ఈ వివాదానికి సంబంధించి బాబు గోగినేని ఒక ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా ఒక ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వివాదానికి సంబంధించిన ఈ రెండు ట్వీట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

వైరల్ అవుతున్న బాబు గోగినేని ట్వీట్…..

అయితే ఈ మొత్తం వివాదంలో హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి దేవి నాగవల్లి కి మద్దతు మద్దతు పలికారు. “ఎంత కోపం, చిరాకు వచ్చినా మహిళలపై అలాంటి పదాలను ప్రేరేపించకూడదు. ఇలాంటి చర్యను సహించబోము. విశ్వక్ సేన్ అలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి” అంటూ మేయర్ విజయలక్ష్మి దేవి నాగవల్లి కి సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. అయితే మరోవైపు బాబు గోగినేని విశ్వక్ సేన్ కు మద్దతుగా ట్వీట్ చేశారు.“దేవి నాగవల్లి.. వీక్షకులతో పాటు విశ్వక్ సేన్‌కి కూడా క్షమాపణలు చెప్పాలి. ఆమెనే ముందుగా విశ్వక్ ని పాగల్ అని, డిప్రెషన్‌కి గురైన వ్యక్తి అని మాట్లాడిన తరువాతే ఈ వివాదం మొదలైంది” , అంటూ బాబు గోగినేని ట్వీట్ చేశారు.

అయితే నెటిజనులు ఈ వివాదంలో మేయర్ విజయలక్ష్మి చేసిన ట్వీట్ మీద స్పందిస్తూ… ఈ వివాదంలో విశ్వక్ సేన్ ఎంత తప్పు ఉందో దేవి నాగవల్లి కూడా అంతే తప్పు ఉంది అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ వివాదంలో మొదటి దేవీ నాగవల్లి నే విశ్వక్ సేన్ను రెచ్చగొట్టింది అంటూ, అలా రెచ్చగొట్టే వ్యాఖ్యలకు మీరు మద్దతు ఇస్తారా అని మేయర్ విజయలక్ష్మిని ప్రశ్నిస్తున్నారు. స్టూడియోకి మీరే అతిథిగా ఆహ్వానించి ఆ వ్యక్తిని మీరు అవమానిస్తారా అంటూ… ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే ప్రస్తుతం బాబు గోగినేని చేసిన ట్వీట్.. మేయర్ చేసిన ట్వీట్ కు నెటిజనుల నుంచి వచ్చిన కామెంట్స్ కు దగ్గరగా ఉండటంతో, విశ్వక్ సేన్ కు సపోర్ట్ చేసే వారికి బాబు గోగినేని ట్వీట్ ఒక ఆయుధంగా మారింది.

Bhargavi

Recent Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

4 hours ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

4 hours ago

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…

4 hours ago

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…

4 hours ago

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…

4 hours ago

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…

4 hours ago