Film industry not supporting Vishwak Sen : నిన్నటి నుండి విశ్వక్, దేవి నాగవల్లి మధ్య ఇష్యూ ఇంకా ముగిసిపోలేదు. ఫలక్ నుమా దాస్ వంటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్. ఆ తరువాత హిట్, పాగల్ వంటి విభిన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకున్నాడు. తాజాగా విశ్వక్ సేన్ నటించిన అశోక వనములో అర్జున కళ్యాణం సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇక అభిమాని చేసిన ప్రాంక్ వల్ల విశ్వక్ పై మానవ హక్కుల కమీషన్ లో కేసు నమోదవడం సర్వాత్ర విమర్శలు రావడం అయ్యాక ఇక ఈ ఇష్యూ టీవీ 9 కి వెళ్ళింది. ఇక దేవి నాగవల్లి విశ్వక్ ను పాగల్ సేన్, డిప్రెస్డ్ పర్సన్ అనడంతో అలా వ్యక్తిగతంగా మాట్లాడొద్దు అంటూ చెప్పిన విశ్వక్ ను దేవి నాగవల్లి గెట్ అవుట్ అంటూ రెచ్చిపోయింది. దీంతో సంయమనం కోల్పోయిన విశ్వక్ సేన్ ఎఫ్ పదం వాడాడు. ఇక ఈ ఇష్యూ మరో మలుపు తీసుకుంది.
ఇక వెను వెంటనే దేవి నాగవల్లి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి విశ్వక్ పై చర్యలు తీసుకోమని చెప్పడం, మహిళలు సంఘాలు రంగంలోకి దిగడం, జర్నలిస్ట్ సంఘాలు కూడా దేవికి మద్దతుగా నిలవడం చకచకా జరిగిపోయాయి. విశ్వక్ కు సినిమా పరిశ్రమ నుండి ఆశించినంత మద్దతు లభించలేదు. విశ్వక్ ఒక మహిళలు పట్ల మాట్లాడిన మాటలు తప్పే కావొచ్చు కానీ జర్నలిస్ట్ గా ఆమె వ్యక్తిగతంగా విశ్వక్ ను అనడం కూడా తప్పే అవుతుంది. విషయం పూర్తిగా తెలుసుకోకుండా విశ్వక్ ను డి గ్రేడ్ చేస్తూ డిబేట్ పెట్టడం కూడా తప్పే.
సినిమా పరిశ్రమ నుండి విశ్వక్ కు లభించని మద్దతు….
విషయం ఎన్నో మలుపులు తిరిగినా దేవి నాగవల్లి కి వస్తున్న మద్దతు ఎందుకు విశ్వక్ కి రాలేదు అనడమే ఇక్కడ ప్రశ్న. సినిమా పెద్దలు ఒక్కరంటే ఒక్కరు మద్దతూ ఇవ్వకపోయినా కనీసం చొరవ తీసుకుని ఈ ఇష్యూ ని ఇక్కడితో ఆపడానికి ప్రయత్నించవచ్చు కదా. కానీ ఒక బడా నిర్మాతనో, ఒక పెద్ద హీరోనో ఎవరో ఒకరు పెద్దమనిషిలా ఈ విషయంలో కల్పించుకోక పోవడం విడ్డూరం. అదే విశ్వక్ స్థానంలో ఏ పెద్ద హీరోనో ఉంటే సినిమా ఇండస్ట్రీ ఇలాగే మౌనంగా ఉండేదా అని నెటిజన్స్ నుండి ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…