Categories: FeaturedMovie News

Actress Madhavi Reddy: నారాయణ మూర్తికి కోపం ఎక్కువ.. డైలాగ్ చెప్పకపోతే ఆర్టిస్టులను కొడతారు: నటి మాధవి రెడ్డి

Actress Madhavi Reddy: తెలుగు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన నటి మాధవి రెడ్డి గురించి అందరికీ తెలిసిందే.కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా బుల్లితెర సీరియల్స్ లో కూడా నటించి ప్రేక్షకులకు సందడి చేస్తున్న మాధవి రెడ్డి హీరోయిన్ గా నటించారనే విషయం చాలామందికి తెలియదు.ఈమె తన కెరీర్ ప్రారంభంలో రెండు సినిమాలలో హీరోయిన్ పాత్రలో నటించానని తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.

Actress Madhavi Reddy: నారాయణ మూర్తికి కోపం ఎక్కువ.. డైలాగ్ చెప్పకపోతే ఆర్టిస్టులను కొడతారు: నటి మాధవి రెడ్డి

ఈ సందర్భంగా మాధవి రెడ్డి మాట్లాడుతూ తాను ఆర్.నారాయణమూర్తి హీరోగా తెరకెక్కిన మార్కెట్లో ప్రజాస్వామ్యం సినిమాలో హీరోయిన్ గా నటించానని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మాధవిరెడ్డి వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా విశేషాల గురించి తెలియజేశారు. ఈ సినిమా కథ మొత్తం విన్న తర్వాత హీరోయిన్ గా ఫిక్స్ చేసి, రెమ్యూనరేషన్ మాట్లాడిన తర్వాత నారాయణ మూర్తి గారు నెలరోజులపాటు మరే ప్రాజెక్టులలోను చేయకుండా కేవలం తన కోసమే పని చేయాలని కండిషన్ పెట్టారట

Actress Madhavi Reddy: నారాయణ మూర్తికి కోపం ఎక్కువ.. డైలాగ్ చెప్పకపోతే ఆర్టిస్టులను కొడతారు: నటి మాధవి రెడ్డి

అప్పట్లో ఎన్నో సీరియల్స్ తోబిజీగా ఉన్నాను తప్పనిసరి పరిస్థితులలో అందరినీ రిక్వెస్ట్ చేసుకొని నెల రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నానని మాధవి రెడ్డి తెలిపారు. ఇక ఈ సినిమా షూటింగ్ చేసే సమయంలో ఎక్కువగా ఎండలో నిలబడాల్సి వచ్చింది. ఇక ఆయన షూటింగ్ సమయంలో ఎంతో సీరియస్ గా ఉండేవారని ఎవరైనా డైలాగ్ సరిగా చెప్పకపోతే వారి పై చేయి చేసుకునే వారని మాధవిరెడ్డి ఈ సందర్భంగా నారాయణ మూర్తి గురించి తెలియజేశారు.

ఆయనకు కోపం ఎక్కువ…

ఇక నారాయణమూర్తి సినిమాకు స్క్రిప్ట్ ఉండదని ఆయన ఏది చెబితే అది చేయాలని మాధవి రెడ్డి వెల్లడించారు. ఇక పోతే సినిమా షూటింగ్ సమయంలో ఎవరు ఎక్కువగా మాట్లాడకూడదు. అలా మాట్లాడితే ఆయనకు ఎంతో కోపమని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నారాయణ మూర్తితో కలిసి నటించిన మార్కెట్లో ప్రజాస్వామ్యం సినిమా గురించి మాధవి రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే ఈమె మజిలీ, వకీల్ సాబ్ వంటి చిత్రాలలో కూడా నటించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago