Suhasini in Hindi language contraversey : హిందీ జాతీయ భాష అంటూ కొందరు కాదు అది కూడా అన్ని భాషలతో పాటు ఒక భాష అంతే అని మరికొందరు వాదన జరుగుతూనే ఉంది. కన్నడ హీరో కిచ్చా సుదీప్, అజయ్ దేవగన్ తో మొదలైన ఈ వివాదం ఇంకా చల్లారలేదు. అజయ్ దేవగన్ ఎందుకు సౌత్ సినిమాలను హిందీ లోకి డబ్ చేస్తున్నారు హిందీ జాతీయ భాష అంటూ చేసిన వాఖ్యలు దుమారం రేపాయి. ఇక ఈ విషయం పై చాలా చర్చలే నడిచాయి. మొదటి నుండి దక్షిణ భారత ప్రజలకు హిందీ భాషను తమపై రుద్దుతున్నారు అనే భావన ఉంది. ఇక ఈ వివాదం అపుడపుడు ఇలా ఎవరో ఒకరి వల్ల మళ్ళీ తెరపైకి వస్తూనే ఉంది.
హిందీ వివాదంలో చిక్కుకున్న సుహాసిని….
ఇక తాజాగా మరోసారి ఈ వివాదం మొదలయింది. కిచ్చా సుదీప్, అజయ్ దేవగన్ తో సంభాషణ తరువాత ఇక్కడితో దీని వదిలేయాలని కోరారు. అయితే వివాదం మాత్రం మళ్ళీ మళ్ళీ తెర పైకి వస్తూనే ఉంది. తాజాగా సీనియర్ నటి సుహాసిని ఒక టీవీ షో లో మాట్లాడుతూ హిందీ మంచి భాష, దానిని మీరు నేర్చుకోవాలి. హిందీ మాట్లాడేవారు మంచివారు, తమిళులు కూడా మంచివారే. మీకు ఎన్ని భాషలు తెలిస్తే, మీరు అంత సంతోషంగా ఉంటారు. మాకు ఆ భాషే కావాలంటే, తిండి దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే, అందరూ అన్ని భాషలు నేర్చుకోవాలి అని అన్నారు. ఇక ఈ మాటలు ఇపుడు తమిళులు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. భాషను ఎంతో అభిమానించే తమిళులు సుహాసిని మాటలను తీవ్రంగా తీసుకున్నారు. సుహాసిని ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇక దీనికి తోడు సోనూ నిగమ్ వాఖ్యలు కూడా తొడయ్యాయి.
తాజాగా సోనూ నిగమ్ హిందీ జాతీయ భాషా కాదా అనే విషయం పై స్పందిస్తూ..మన దేశంలో ఎన్నో భాషలు మాట్లాడేవారు ఉన్నారు. ఒక్కో భాషకు ఒక్కో ప్రత్యేకత ఉంది. అయినా, హిందీ జాతీయ భాష అని రాజ్యాంగంలో ఎక్కడ రాయలేదు.ఎక్కువ మంది మాట్లాడే భాష మాత్రమే హిందీ. తమిళం దేశంలోనే అత్యంత ప్రాచీన భాష. ఈ దేశంలో ఒకే భాష ఉందని, అంతా దాన్నే మాట్లాడాలంటూ భాషను రుద్దడం తగదు. ఏ భాష మాట్లాడాలో ఎంచుకునే హక్కు ప్రజలకు ఉంది. భాషల పేరుతో ప్రజలను విడదీయొద్దు అని అన్నారు. ఇక ఈ వాఖ్యలను చూపుతూ సుహాసిని ని ఏకిపారేస్తున్నారు తమిళ జనం నీకంటే సోనూ నిగమ్ బెటర్ నువ్వు పోయి బాలీవుడ్ లో సినిమాలు చేసుకో అంటూ మండిపడుతున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…