అనంతపురం జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తాడిపత్రి మండలంలోని బ్రహ్మణపల్లెకు కూలీలతో వెళ్తున్న వాహనం బోల్తా పడి ఒకరు మరణించారు. మరో 19 మందికి తీవ్రగాయాలయ్యాయి.
ఈ ఘటన గురించి పోలీసులు వివరాలు ఇలా తెలిపారు. వాళ్లంతా రోజూ పత్తి తీసేందుకు కూలీ పనులకు వెళ్తుండేవారు. తాడిపత్రి నుంచి బ్రహ్మణపల్లిలో పనులకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇలా నేడు వారంతా మినీ ఐచర్ లారీలో వెళ్తుండగా.. వాహనం అదుపు తప్పింది.
చుక్కలూరు వద్ద బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 19 మందికి తీవ్రగాయాలైనట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని స్థానికులు తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో ఐదుగురి పరిస్థితి విషయంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తాడిపత్రి పోలీసులు తెలిపారు. వాహనాలు నడిపే సందర్భంలో డ్రైవర్ అప్రమత్తంగా ఉండాలని.. మద్యం సేవించి వాహనాలను నడపరాదని పోలీసులు హెచ్చరించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా తీవ్ర విషాదం నెలకొంది. చనిపోయిన వారి బంధువులు విషయం తెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ దృశ్యాలు ప్రతీ ఒక్కరినీ కంటతడి పెట్టించాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…