టాలీవుడ్ ఇండస్ట్రీలో గొప్ప దర్శకుడిగా పేరు సంపాదించుకున్న ఎస్ఎస్ రాజమౌళి సినిమా అంటే ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. బాహుబలి సినిమా ద్వారా తెలుగు సినిమా క్రేజ్ ఏ విధంగా ఉంటుందో యావత్ దేశానికి చూపించారు. అయితే తాజాగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఆర్ఆర్ఆర్” సినిమాపై అందరి దృష్టి పడింది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు,టీజర్లు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.
ఇప్పటికే ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. చిత్ర యూనిట్ సభ్యులకు గాయాలు కావడం,కరోనా మొదటి రెండవ దశ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా కరోనా పరిస్థితులు కాస్త కుదుట పడటంతో తిరిగి చిత్రబృందం షూటింగ్లో పాల్గొన్నారు.
సుమారు మూడు నెలల తర్వాత షూటింగ్ మొదలు పెట్టిన సందర్భంగా చిత్ర బృందం అభిమానులకు ఒక అప్డేట్ ఇవ్వడానికి సన్నాహాలు చేశారు. కరోనా మొదటి వ్యక్తి తర్వాత షూటింగ్ మొదలు పెట్టిన చిత్రయూనిట్ అందుకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేశారు. తాజాగా RRR గర్జన అంటూ మరో వీడియోను వదిలారు.
RRR గర్జన అంటూ విడుదల చేసిన ఈ వీడియోలో ఎన్టీఆర్, రామ్ చరణ్ దుమ్ములేపేశారు. ఇక ఈ వీడియోలో మిగతా నటీనటులు శ్రియా, అజయ్ దేవగణ్, అలియా భట్ ఇలా అందరినీ చూపించారు. ఈ చిత్రంలో యాక్షన్ సీక్వెన్‌లు ఎలా ఉండబోతున్నాయో చెప్పడానికి ఈ వీడియో చిన్న ఉదాహరణగా చూపించారు. మొత్తానికి రాజమౌళి ఈ సినిమా ద్వారా తెరపై మరొక మ్యాజిక్ క్రియేట్ చేసేందుకు సిద్ధమయ్యారని RRR గర్జన ద్వారా తెలుస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం రాజమౌళి గర్జన ఎలా ఉందో మీరు ఓ లుక్కేయండి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…