అదిరిపోయిన “ఆర్ఆర్ఆర్” గర్జన.. వీడియో వైరల్!

0
54

టాలీవుడ్ ఇండస్ట్రీలో గొప్ప దర్శకుడిగా పేరు సంపాదించుకున్న ఎస్ఎస్ రాజమౌళి సినిమా అంటే ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. బాహుబలి సినిమా ద్వారా తెలుగు సినిమా క్రేజ్ ఏ విధంగా ఉంటుందో యావత్ దేశానికి చూపించారు. అయితే తాజాగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఆర్ఆర్ఆర్” సినిమాపై అందరి దృష్టి పడింది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు,టీజర్లు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

ఇప్పటికే ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. చిత్ర యూనిట్ సభ్యులకు గాయాలు కావడం,కరోనా మొదటి రెండవ దశ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా కరోనా పరిస్థితులు కాస్త కుదుట పడటంతో తిరిగి చిత్రబృందం షూటింగ్లో పాల్గొన్నారు.

సుమారు మూడు నెలల తర్వాత షూటింగ్ మొదలు పెట్టిన సందర్భంగా చిత్ర బృందం అభిమానులకు ఒక అప్డేట్ ఇవ్వడానికి సన్నాహాలు చేశారు. కరోనా మొదటి వ్యక్తి తర్వాత షూటింగ్ మొదలు పెట్టిన చిత్రయూనిట్ అందుకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేశారు. తాజాగా RRR గర్జన అంటూ మరో వీడియోను వదిలారు.

RRR గర్జన అంటూ విడుదల చేసిన ఈ వీడియోలో ఎన్టీఆర్, రామ్ చరణ్ దుమ్ములేపేశారు. ఇక ఈ వీడియోలో మిగతా నటీనటులు శ్రియా, అజయ్ దేవగణ్, అలియా భట్ ఇలా అందరినీ చూపించారు. ఈ చిత్రంలో యాక్షన్ సీక్వెన్‌లు ఎలా ఉండబోతున్నాయో చెప్పడానికి ఈ వీడియో చిన్న ఉదాహరణగా చూపించారు. మొత్తానికి రాజమౌళి ఈ సినిమా ద్వారా తెరపై మరొక మ్యాజిక్ క్రియేట్ చేసేందుకు సిద్ధమయ్యారని RRR గర్జన ద్వారా తెలుస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం రాజమౌళి గర్జన ఎలా ఉందో మీరు ఓ లుక్కేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here