Robo Shankar: సాధారణంగా సినిమా సెలబ్రిటీలు బుల్లితెర నటీనటులు పెద్ద ఎత్తున యూట్యూబ్ ఛానల్స్ ప్రారంభించి వారికి సంబంధించిన వీడియోలను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేస్తూ ఉంటారు. ఇక చాలామంది యూట్యూబ్ ఛానల్స్ వారు ఇతర సెలబ్రిటీల ఇంటికి వెళ్లి వారి హోమ్ టూర్ వీడియోలను కూడా తీస్తూ వారి యూట్యూబ్ ఛానల్ లో షేర్ చేస్తూ ఉంటారు.
ఇలా ఓ తమిళ యూట్యూబ్ ఛానల్ నటుడు రోబో శంకర్ హోమ్ టూర్ వీడియోని చేశారు. నటుడు రోబో శంకర్ తమిళ నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇక ఈయన నటించిన సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి ఇక్కడ కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. తాజాగా నటుడు రోబో శంకర్ ఓ వివాదంలో చిక్కుకున్నట్టు తెలుస్తుంది.
ఓ యూట్యూబ్ ఛానల్ ఈయన హోమ్ టూర్ వీడియోని చేశారు. ఈ క్రమంలోనే ఈ వీడియోని యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేయడంతో ఈయన ఏకంగా ఐదు లక్షల రూపాయల జరిమానా చెల్లించాల్సి వచ్చింది అసలు హోమ్ టూర్ వీడియోకి జరిమానాకు సంబంధం ఏంటి అనే విషయానికి వస్తే నటుడు రోబో శంకర్ తన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు అన్నింటి గురించి చాలా అద్భుతంగా వివరించారు. అయితే ఈయన ఇంట్లో అలెగ్జాండ్రేన్ పారకీట్స్ అనే జాతి చిలకలు ఉన్నాయి.
ఇక ఈ చిలుకలను కూడా యూట్యూబ్ ఛానల్ లో చూపించారు. అయితే 1972 జంతు సంరక్షణ చట్టంలో భాగంగా అనుమతి లేకుండా ఇలాంటి పక్షులను పెంచుకోవడం పూర్తిగా తప్పు ఈ క్రమంలోనే ఈ వీడియో చూసినటువంటి ప్రేమికుడు ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు నటుడు రోబో శంకర్ ఇంటికి చేరుకొని ఆ పక్షులను స్వాధీనం చేసుకోవడమే కాకుండా,పక్షులను పెంచుకోవడం కోసమే ఎలాంటి అనుమతి తీసుకోకపోవడంతో ఏకంగా ఐదు లక్షల రూపాయల జరిమానా విధించారు.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…