Rocking Rakesh: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా గుర్తింపు సంపాదించుకున్న వారిలో రాకింగ్ రాకేష్ జోర్దార్ సుజాత ఒకరు.వీరిద్దరూ కలిసి స్కిట్లు చేయడమే కాకుండా వీరిద్దరూ ప్రేమలో పడటం త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ నెల చివరన వీరిద్దరి నిశ్చితార్థం జరగనుందని సుజాత వెల్లడించారు.ఇప్పటికే నిశ్చితార్థానికి సంబంధించిన షాపింగ్ పనులు పూర్తి కావడమే కాకుండా నిశ్చితార్థం కోసం బంధువులను సన్నిహితులను కూడా ఆహ్వానిస్తున్నారు.
ఈ క్రమంలోనే జోర్దార్ సుజాత,రాకింగ్ రాకేష్ ఇద్దరు కూడా నగరిలో ఉన్నటువంటి రోజా ఇంటికి వెళ్లారు.రాకింగ్ రాకేష్ రోజా ఇంటికి చేరుకోవడంతో అక్కడ రోజా గారు మీటింగ్ లో ఉన్న నేపథ్యంలో ఈయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా రోజా గారి వంటగదిలోకి వెళ్లి ఆలూ ఫ్రై చేశారు. ఇలా తాను చేసిన వంటతో అందరూ భోజనాలు చేశారు.
అనంతరం రోజా గారితో ముచ్చటించి తన నిశ్చితార్థానికి ఆహ్వానించారు. అనంతరం రోజా ఊహించని విధంగా కాబోయే పెళ్లికూతురు జోర్దార్ సుజాతకు పట్టుచీరను పెట్టారు.ఇక రోజా స్వయంగా తన కారులో సుజాత రాకింగ్ రాకేష్ ఇద్దరిని తిరుమల స్వామివారి దర్శనం కోసం తీసుకువెళ్లారు.
రాకింగ్ రాకేష్ ఈ వీడియోని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేస్తూ ఇలా స్వయంగా రోజా గారు దగ్గరుండి మమ్మల్ని కొండపైకి తీసుకెళ్లి స్వామివారి దర్శనం చేయించడం ఎన్నో జన్మల అదృష్టం అంటూ మురిసిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈనెల చివరిలో నిశ్చితార్థం జరుపుకోనున్న ఈ జంట వచ్చే నెలలో వివాహం కూడా చేసుకోబోతున్నారని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…