Urvashi Rautela: బాబీ దర్శకత్వంలో చిరంజీవి శృతిహాసన్ జంటగా నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య.ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఇక ఈ సినిమా అతి తక్కువ సమయంలోనే బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా పది రోజుల వ్యవధిలోనే 200 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించింది.
ఇక సినిమాలోని బాస్ పార్టీ సాంగ్ ఎలాంటి సంచలనం సృష్టించిందో మనకు తెలిసిందే. దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ కు మెగాస్టార్ చిరంజీవి పర్ఫామెన్స్ అద్భుతంగా సెట్ అయింది. ఇక ఈ పాటలో చిరంజీవి సరసన బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలా అదిరిపోయే పర్ఫామెన్స్ చేశారు.
ఈ పాటలో నటించడం కోసం ఊర్వశి తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.ఈ సినిమాలోని ఈ పాటను ఒక ప్రత్యేకమైన సెట్ వేసి షూటింగ్ చేశారని తెలుస్తోంది. ఈ సెట్ కోసం సుమారు 30 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్టు సమాచారం. ఇక ఈ పాటలో నటించినందుకు గాను నటి ఊర్వశి ఏకంగా రెండు కోట్ల రూపాయల ఛార్జ్ చేసినట్టు తెలుస్తుంది.
ఇలా ఒక పాట కోసం రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదని పెద్ద మొత్తంలోనే ఈ రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. కేవలం మూడు నిమిషాల పాటు కోసం ఊర్వశి రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారంటే ఆమె క్రేజ్ ఇండస్ట్రీలో ఎలా ఉందో అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…