Roja: వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి, సినీనటి ఆర్కే రోజా ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈమే గత ఎన్నికలలో నగరి నియోజకవర్గంలో నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. ఇక రోజుకు అధికారం లేకపోయినా ఎప్పటికప్పుడు అధికార ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా రోజా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రోజా, మెగా కుటుంబం ప్రశంశల వర్షం కురిపించడంతో ఒక్కసారిగా ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఇంటర్వ్యూ సందర్భంగా రామ్ చరణ్ ప్రస్తావనకు రావడంతో చరణ్ గురించి రోజా మాట్లాడుతూ మెగా కుటుంబానికి నాకు మధ్య రాజకీయాల పరంగా విభేదాలు ఉండొచ్చు కానీ సినిమాల పరంగా మంచి వాతావరణమే ఉందని తెలిపారు.
ముఖ్యంగా చరణ్ గురించి మాట్లాడుతూ చిన్నప్పుడు చరణ్ చాలా అల్లరి చేసేవాడు ముఠామేస్త్రి సినిమా షూటింగ్ ఊటీలో జరుగుతున్న సమయంలో చరణ్ అక్కడికి తీసుకు వచ్చారు. షూటింగ్ పూర్తి కాగానే చరణ్ ను ఎత్తుకొని ఆడించేదాన్ని స్కూల్ కి వెళ్లే ముందు వరకు కూడా చరణ్ చాలా అల్లరి చేసేవాడని స్కూల్ వెళ్లాక కాస్త తగ్గిందని రోజా తెలిపారు.
ఇక రామ్ చరణ్ నటించిన RRR సినిమాపై కూడా ఈమె ప్రశంశల వర్షం కురిపించారు. ఈ సినిమాలో చరణ్ నటన చాలా అద్భుతంగా ఉందని చరణ్ డాన్స్ చేస్తే వాళ్ళ నాన్న చిరంజీవి కనిపిస్తారని రోజా తెలిపారు. ఇక ఈ సినిమాలో ఓపెనింగ్ షార్ట్ అందరి పైకి దూకుతూ వచ్చిన సన్నివేశం తనకు బాగా నచ్చింది అంటూ రోజా చరణ్ నటన గురించి మెగా కుటుంబం గురించి చేసిన ఈ వ్యాఖ్యలపై నేటిజన్స్ విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. అధికారం లేకపోయేసరికి ఎవరు ఎలాంటి వారో రోజకూ ఇప్పుడు అర్థమవుతుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…