వెండి తెరపై కొందరి హీరో హీరోయిన్ల కాంబినేషన్ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. వారి కాంబినేషన్ రిపీట్ అయితే బాగుంటుందని ఎంతోమంది ఎదురుచూస్తుంటారు.అదేవిధంగా బుల్లితెరపై కూడా కొన్ని జంటలు ఎవర్ గ్రీన్ అన్నట్టుగానే ఉంటాయి.ఈ విధంగా వెండితెరపై బుల్లితెరపై ఎంతో మంది అభిమానులను సందడి చేసే ఆ జంటలు నిజజీవితంలో కూడా ఒక్కటైతే చూడాలని ఎంతోమంది వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తుంటారు.
ఈ విధంగా బుల్లితెరపై ఎవర్ గ్రీన్ జంటగా పేరు సంపాదించుకున్న వారిలో రష్మి -సుదీర్ ఒకరు. ఈ కార్యక్రమంలోనైనా రష్మి సుదీర్ ఉన్నారంటే ఆ కార్యక్రమం ఎంతో విజయవంతం అవుతుంది. అంతగా ఈ జంటకు పాపులారిటీ ఉందని చెప్పవచ్చు. ఈ జంటకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి నిర్వాహకులు వీరితో పలు ఈవెంట్స్, స్పెషల్ షో లు చేస్తుంటారు.
ఈ క్రమంలోనే ఈ జంట గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను దృష్టిలో ఉంచుకొని షో నిర్వాహకులు వీరికి పలు కార్యక్రమాలలో ఉత్తిత్త పెళ్లిళ్లు చేసి షో రేటింగ్స్ పెంచుకుంటారు. ఈ క్రమంలోనే వినాయక చవితి పండుగ సందర్భంగా ఈటీవీలో నిర్వహిస్తున్న టువంటి “ఊరిలోవినాయకుడు” కార్యక్రమంలో కూడా ఈ విధమైనటువంటి ప్రయత్నం చేశారు నిర్వాహకులు.
ఈ క్రమంలోనే తొమ్మిది సంవత్సరాల నుంచి పరిచయం ఏర్పడి వారి ప్రేమకు ఎండ్ కార్డ్ పడినట్లు తెలుస్తోంది. తాజాగా ఊరిలో వినాయకుడు అనే ప్రోగ్రామ్ కి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. ఈ ఈ కార్యక్రమంలో భాగంగా సుధీర్, రష్మి వారు తొమ్మిది సంవత్సరాల ప్రేమకు గుర్తుగా చేసినటువంటి లవ్ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు.
గత తొమ్మిది సంవత్సరాల నుంచి వీరి మధ్య జరిగినటువంటి కొన్ని తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒకరికొకరు బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటూ పాటల రూపంలో రష్మి తన ప్రేమను వ్యక్తపరిచారు. ఇక ఈ పాటలను చూసిన రోజా తొమ్మిది సంవత్సరాలు వెయిట్ చేసినందుకు రష్మీ ఎంతో అందంగా ప్రపోజ్ చేసింది. మీరు ఇద్దరు పెళ్లి చేసుకుంటే చూడాలని ప్రతి ఒక్కరి కోరిక అంటూ రోజా సంచలన వ్యాఖ్యలు చేయగా ఒక్కసారిగా రష్మి సుదీర్ కౌగిలించుకొని ఎంతో బావోద్వేగానికి గురయ్యారు. అంతలో ఇంద్రజ మాట్లాడుతూ మీ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఓకే ఎస్ అనే ఫైనల్ వరల్డ్ కావాలి మాకు అంటూ ఈ కార్యక్రమం పై ఆసక్తని పెంచారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…