Movie News

Roja: జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రోజా…. సంతోషంలో అభిమానులు!

Roja: బుల్లితెర మీద ప్రసారమవుతున్న కామెడీ షో అనగానే అందరికీ మొదటగా గుర్తొచ్చే పేరు జబర్దస్త్. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో గత పది సంవత్సరాలుగా ప్రసారం అవుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ప్రతి గురు శుక్రవారాలలో ప్రసారం అవుతున్న ఈ కామెడీ షో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. అయితే ఈ షోలో వినిపించి డబుల్ మీనింగ్ డైలాగులు వల్ల కొంతమంది ప్రేక్షకులు ఈ షోని బూతు షో అని విమర్శలు చేస్తున్నప్పటికీ షో రేటింగ్స్ మాత్రం తగ్గటం లేదు.

ఇలా గత పది సంవత్సరాలుగా టాప్ రేటింగ్స్ తో దూసుకుపోతున్న ఈ జబర్దస్త్ కామెడీ షో తొందరలోనే 500 ఎపిసోడ్లు పూర్తి చేసుకోనుంది. 500 వ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల అయింది.
ఇక ఈ స్పెషల్ ఎపిసోడ్ మినిస్టర్ రోజా గెస్ట్ గా హాజరు అయ్యారు. 9 సంవత్సరాల పాటు జబర్దస్త్ కామెడీ షోలో జడ్జిగా వ్యవహరించిన రోజా మంత్రి పదవి దక్కటంతో తన పూర్తి సమయాన్ని ప్రజల సేవకై అంకితం చేయటానికి జబర్దస్త్ కు దూరం అయింది.

9 సంవత్సరాల పాటు జబర్దస్త్ షో కి మంచి రేటింగ్స్ రావటానికి కమెడియన్ల పాత్ర ఎంత ఉందో జడ్జిగా రోజా పాత్ర కూడా ఉంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇటీవల విడుదల చేసిన ప్రోమోలో రోజా ఎంట్రీ ఇవ్వడం చూసి ఇంద్రజతో పాటు కృష్ణ భగవాన్ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కమెడియన్ లందరూ రోజాకే గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఈ ఎపిసోడ్ లో రోజా మాట్లాడుతూ..జబర్దస్త్ స్పెషల్ ఎపిసోడ్ కి ఎలా గెస్ట్ గా హాజరు కావడం ఆనందంగా ఉందని రోజా చెప్పుకు వచ్చింది.

Roja: జబర్దస్త్ వేదికపై రోజాకు సన్మానం…

నాతోపాటు హీరోయిన్లుగా చేసిన వారిని ప్రేక్షకులు మర్చిపోయారు. కానీ ఇప్పటికీ ప్రేక్షకులు నన్ను గుర్తు పెట్టుకోవడానికి ముఖ్య కారణం ఈ జబర్దస్త్ అంటూ జబర్దస్త్ గురించి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రోజా ఇలా గిఫ్ట్ గా హాజరు కావడంతో తిరిగి ఆమె ఇలా స్టేజ్ మీద చూసినందుకు ఆమె అభిమానులు చాలా సంబరపడుతున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ టీం రోజాకు ఘనంగా సన్మానం చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago