Manchu Vishnu: బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి రియాలిటీ షోలలో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం అన్ని భాషలలోనూ ప్రసారమవుతూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ క్రమంలోనే తెలుగులో ఈ కార్యక్రమం ప్రస్తుతానికి మారు సీజన్లను పూర్తి చేసుకుంది.
ఇకపోతే త్వరలోనే ఏడవ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సీజన్ గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ కార్యక్రమం మొదటి సీజన్ ఎన్టీఆర్ రెండవ సీజన్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు అనంతరం తదుపరి సీజన్లన్నింటికీ కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు.
నాగార్జున బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్టింగ్ విషయంలో పక్షపాతం చూపిస్తున్నారని ఈయన హోస్ట్ గా నిర్వహిస్తున్న సమయంలో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు.ఈ క్రమంలోనే సీజన్ సెవెన్ కి నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరించరని ఆయన స్థానంలో ఇతర హీరోలు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించబోతున్నారని వార్తలు వచ్చాయి. నాగార్జున స్థానాల్లో బాలకృష్ణ, రామ్ చరణ్, రానా వంటి హీరోల పేర్లు వినిపించాయి.
అయితే తాజాగా ఈ జాబితాలోకి మరో హీరో పేరు చేరింది. బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమానికి మంచు విష్ణు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు విష్ణువుని సంప్రదించారని సమాచారం. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మేకర్స్ అధికారిక ప్రకటన తెలియజేయాల్సి ఉంది.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…