Roja went to MegaStar house first time as a minister : సర్పయాగం సినిమా ద్వారా మొదటి సారి వెండి తెరపై కనిపించింది రోజా. సీతారత్నం గారి అబ్బాయి సినిమా తన సినిమా కెరీర్ లో ఒక టర్నింగ్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో టాప్ హీరోలతో నటిస్తూ స్టార్ ఇమేజ్ ను ఎంజాయ్ చేసింది. తర్వాత సినిమా అవకాశాలు సన్నగిలుతున్న సమయంలో తమిళ దర్శకుడు సెల్వ మణి ని ప్రేమ వివాహం చేసుకుంది. 1999వ సంవత్సరంలో రాజకీయ ప్రవేశం చేసిన రోజా ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుని.
పదేళ్లపాటు తెలుగు మహిళ అధ్యక్షురాలిగా సేవలు అందించి తర్వాత 2014లో వైసిపి తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే రెండు సార్లు ఎమ్మెల్యే అయినా కూడా మంత్రిగా బాధ్యతలు చేపట్ట లేదు. అయితే తాజాగా రెండో విడత క్యాబినెట్ విస్తరణ కారణంగా ఆమె ను మంత్రి పదవి వరించింది.ఏపీ టూరిజం శాఖ మంత్రిగా బాధ్యతలు రోజా బాధ్యతలు తీసుకున్నారు. అయితే మంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత సినిమాలకు టీవీ షో లకు గుడ్ బై చెప్పేసి తన విలువైన సమయాన్ని తన బాధ్యతలు నిర్వహించడానికి కేటాయించారు. అయితే బాధ్యతలు చేపట్టిన తర్వాత బిజీగా ఉన్న రోజా గారు ప్రస్తుతం కుటుంబ సమేతంగా హైదరాబాద్ కు విచ్చేసారు.
మంత్రి అయ్యాక మొదటిసారి చిరంజీవి ఇంటికి…..
కుటుంబ సమేతంగా హైదరాబాద్ విచ్చేసిన రోజా మంత్రి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మర్యాదపూర్వకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఇంటికి, మెగాస్టార్ చిరంజీవి వాళ్ళ ఇంటికి కుటుంబ సమేతంగా వెళ్లారు. మెగాస్టార్ ఇంటికి కుటుంబ సమేతంగా వెళ్ళిన రోజాను ఆయన సతీమణి సురేఖ సాదరంగా ఆహ్వానించారు. ఆచార్య సినిమా విడుదల అయినందుకు చిరంజీవికి, మంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన అందుకు రోజా కి ఒకరికొకరు అభినందనలు చెబుతున్నారు. ఇరువురు వారి కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు.
అంతేకాకుండా మెగాస్టార్ దంపతులు రోజాకు శాలువా కప్పి సన్మానం చేశారు ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్ లో వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటి తోపాటు రోజా కెసిఆర్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్లారు. అక్కడ కూడా రోజా ను సత్కరించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…