దర్శకుడు అనిల్ పాదురి దర్శకత్వంలో యంగ్ హీరో ఆకాష్ పూరి, కేతిక శర్మ జంటగా నటించిన తాజా చిత్రం రొమాంటిక్. ఈ సినిమా అక్టోబర్ 29న విడుదల కానుంది. ఈ సినిమాను పూరి జగన్నాథ్ చార్మి లో సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరోయిన్ కేతికశర్మ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా హీరోయిన్ కేతిక శర్మ మాట్లాడుతూ..
నేను ఢిల్లీ నుంచి వచ్చాను. మాది డాక్టర్ ఫ్యామిలీ. అయితే తాను మాత్రం ఒక కొత్త ప్రపంచాన్ని ఎంచుకున్నాను అని తెలిపింది. నాకు ఈ సినిమా రంగం అంటే చాలా ఇష్టం. సినిమా ఫీల్ రావాలని అనుకున్నాను. ఈ రొమాంటిక్ సినిమాతో వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఆమె ఆనందాన్ని వ్యక్తం చేసింది.
ఇంస్టాగ్రామ్ లో మిమ్మల్ని చూసాను ఒకసారి మీరు ఆడిషన్స్ కి రండి అని పూరి కనెక్ట్ నుంచి కాల్ వచ్చింది. నేను ఆడిషన్స్ కి వచ్చాను. వాళ్లు నన్ను చేశారు అలా ఈ సినిమాతో తన కెరీర్ మొదలైంది అని చెప్పుకొచ్చింది కేతిక శర్మ. ఇక ఈ సినిమాలో నా పాత్ర ఈ క్షణం ఎంజాయ్ చేయాలని అనుకునే అమ్మాయి పాత్రలో కనిపిస్తాను అని తెలిపింది. సమాజంలో కట్టుబాట్లు గురించి ఆలోచించకుండా తనకు నచ్చినట్టుగా బతికే ఒక అమ్మాయి క్యారెక్టర్ పాత్రలో నటించాను అని తెలిపింది.
ఇక నా మొదటి సినిమానే పూరి కనెక్ట్ వంటి పెద్ద బ్యానర్లో చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అతని నుంచి నేను చాలా నేర్చుకున్నాను అని తెలిపింది. అలాగే నా మొదటి సినిమాలోనే నాకు పాట పాడే అవకాశం వచ్చింది. నన్ను నేను తెరపై చూసుకోవాలని కల నెరవేరుతోంది అని తెలిపింది. ఇక ఆమెకు సాయి పల్లవి అంటే చాలా ఇష్టం, సాయి పల్లవి చాలా క్యాజువల్ గా నటిస్తుందని, ఇటీవలే రిలీజ్ అయిన లవ్ స్టోరీ సినిమా చూశానని అందులో సాయి పల్లవి సహజంగా నటించింది. ఆమె డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కేతిక శర్మ.
దక్షిణ భారతీయుల రోజువారీ ఆహారంలో ఇడ్లీ, దోశలకు ప్రత్యేక స్థానం ఉంది. వేగవంతమైన జీవనశైలిలో సమయం ఆదా కోసం చాలామంది…
మధుమేహం (డయాబెటిస్) వల్ల వచ్చే సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలంగా షుగర్ నియంత్రణలో లేకపోతే నరాలపై ప్రభావం పడే…
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…