ప్రస్తుత కాలంలో సినిమా షూటింగ్ల కోసం దర్శకనిర్మాతలు హీరోహీరోయిన్లు అందమైన లొకేషన్లలో వెళ్తుంటారు. ఈ క్రమంలోనే వివిధ దేశాలకు వెళ్లి షూటింగ్లను నిర్వహిస్తుంటారు. ఇక మన దేశంలో అయితే ఒక చిన్న పాట కైనా, మాట పైన ఇతర దేశాలకు వెళ్లడానికి దర్శకులు మక్కువ చూపించడంతో నిర్మాతలు కూడా అందుకు సై అంటున్నారు. అయితే ఇటువంటి అందమైన లొకేషన్లలో షూటింగ్ తీయడం కోసం రష్యన్ మరో అడుగు ముందుకేసింది.
రష్యా ప్రస్తుతం సినిమా షూటింగ్ ను ఏకంగా అంతరిక్షంలో చేయడానికి సిద్ధమైంది.కాస్మోస్‌లో మొదటి ఫీచర్ ఫిల్మ్‌ను షూట్ చేసేందుకు త్వరలోనే ఓ నటిని, దర్శకుడిని అంతరిక్షంలోకి పంపించనున్నట్లు రష్యా ప్రకటించింది. గతంలో ఇలాంటి ప్రకటన అమెరికా చేసిందని, ప్రస్తుతం రష్యా కూడా అటువంటి ప్రకటన చేసింది.
రష్యా చిత్రీకరించనున్న ఈ ‘స్పేస్ డ్రామా’ పేరు ‘చాలెంజ్’. ప్రముఖ రష్యన్ నటి యులియా పెరెసిల్డ్ (36) ఇందులో నటించనుండగా, 37 ఏళ్ల దర్శకుడు క్లిమ్ షిపెన్కో దర్శకత్వం వహిస్తున్నారు. సాధారణంగా మామూలు షూటింగ్ అంటేనే ఎన్నో టేక్ లు తీసుకుంటారు. అలాంటిది అంతరిక్షంలో అది జీరో గ్రావిటేషనల్ ఫోర్స్ లో షూటింగ్ అంటే మామూలు విషయం కాదు.
అంతరిక్షంలో షూటింగ్ నిర్వహించడానికి ముందుగానే నటుడికి దర్శకుడికి సెంట్రిఫ్యూజ్ విమానాల్లో జీరో గ్రావిటీపై శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు డిమిట్రీ రోగోజిన్‌తోపాటు ప్రభుత్వ చానల్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంతరిక్ష ప్రయోగాలలో పోటీపడుతున్న అమెరికాకు ధీటుగా రష్యా స్పేస్ టూరిజం ప్రోగ్రామును కూడా ప్రారంభించింది. ఏదిఏమైనా అంతరిక్షంలో సినిమా షూటింగ్ అంటే ఈ సినిమాపై ఎంతో ఆతృత నెలకొంది. రష్యా అమెరికా లాగా కేవలం మాటలకు మాత్రమే పరిమితం చేస్తారా లేకపోతే సినిమా షూటింగ్ చేసి చూపిస్తారో వేచిచూడాలి
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…