షూటింగ్ కోసం నిజంగా అంతరిక్షంలోకి నటి, దర్శకుడిని పంపుతున్నారు?

0
45

ప్రస్తుత కాలంలో సినిమా షూటింగ్ల కోసం దర్శకనిర్మాతలు హీరోహీరోయిన్లు అందమైన లొకేషన్లలో వెళ్తుంటారు. ఈ క్రమంలోనే వివిధ దేశాలకు వెళ్లి షూటింగ్లను నిర్వహిస్తుంటారు. ఇక మన దేశంలో అయితే ఒక చిన్న పాట కైనా, మాట పైన ఇతర దేశాలకు వెళ్లడానికి దర్శకులు మక్కువ చూపించడంతో నిర్మాతలు కూడా అందుకు సై అంటున్నారు. అయితే ఇటువంటి అందమైన లొకేషన్లలో షూటింగ్ తీయడం కోసం రష్యన్ మరో అడుగు ముందుకేసింది.

రష్యా ప్రస్తుతం సినిమా షూటింగ్ ను ఏకంగా అంతరిక్షంలో చేయడానికి సిద్ధమైంది.కాస్మోస్‌లో మొదటి ఫీచర్ ఫిల్మ్‌ను షూట్ చేసేందుకు త్వరలోనే ఓ నటిని, దర్శకుడిని అంతరిక్షంలోకి పంపించనున్నట్లు రష్యా ప్రకటించింది. గతంలో ఇలాంటి ప్రకటన అమెరికా చేసిందని, ప్రస్తుతం రష్యా కూడా అటువంటి ప్రకటన చేసింది.

రష్యా చిత్రీకరించనున్న ఈ ‘స్పేస్ డ్రామా’ పేరు ‘చాలెంజ్’. ప్రముఖ రష్యన్ నటి యులియా పెరెసిల్డ్ (36) ఇందులో నటించనుండగా, 37 ఏళ్ల దర్శకుడు క్లిమ్ షిపెన్కో దర్శకత్వం వహిస్తున్నారు. సాధారణంగా మామూలు షూటింగ్ అంటేనే ఎన్నో టేక్ లు తీసుకుంటారు. అలాంటిది అంతరిక్షంలో అది జీరో గ్రావిటేషనల్ ఫోర్స్ లో షూటింగ్ అంటే మామూలు విషయం కాదు.

అంతరిక్షంలో షూటింగ్ నిర్వహించడానికి ముందుగానే నటుడికి దర్శకుడికి సెంట్రిఫ్యూజ్ విమానాల్లో జీరో గ్రావిటీపై శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు డిమిట్రీ రోగోజిన్‌తోపాటు ప్రభుత్వ చానల్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంతరిక్ష ప్రయోగాలలో పోటీపడుతున్న అమెరికాకు ధీటుగా రష్యా స్పేస్ టూరిజం ప్రోగ్రామును కూడా ప్రారంభించింది. ఏదిఏమైనా అంతరిక్షంలో సినిమా షూటింగ్ అంటే ఈ సినిమాపై ఎంతో ఆతృత నెలకొంది. రష్యా అమెరికా లాగా కేవలం మాటలకు మాత్రమే పరిమితం చేస్తారా లేకపోతే సినిమా షూటింగ్ చేసి చూపిస్తారో వేచిచూడాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here