Movie News

Rowdy Rani : సూపర్ స్టార్ కృష్ణ కౌబాయ్ చిత్రాలకు ప్రేరణ.. మొదటి లేడీ ఓరియంటెడ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం.?!

Rowdy Rani : అనుకోకుండా దర్శకులు అయిన వారిలో కే.ఎస్.ఆర్ దాస్ ఒకరు. ఆయన మొదట దర్శకత్వం వహించిన “లోగుట్టు పెరుమాళ్ళకెరుక” అనే చిత్రం పరాజయం పొందింది. ఆ తర్వాత ఆ సినిమా ఫెయిల్ కావడంతో నిర్మాత భావన్నారాయణ తన దగ్గర నుంచి వెళ్లగొట్టారు. ఎడిటర్ గా ఉన్నా తనని “లోగుట్టు పెరుమాళ్ళ కెరుక’ చిత్రానికి దర్శకత్వం చేయమన్నారు. అది పరాజయం పొందితే నన్ను నిందిస్తున్నారు. ఇదేమి విచిత్రం అని KSR.దాస్ తనలో తాను బాధ పడ్డారు. ఆ తర్వాత కృష్ణతో తీసిన ‘ప్రేమజీవులు’, ‘గూడచారి116’, ‘టక్కరి దొంగ చక్కని చుక్క’ చిత్రాలు విజయం సాధించాయి.

ఆ తర్వాత విజయలలిత ప్రధాన పాత్రలో “రౌడీరాణి” చిత్రం KSR.దాస్ రూపొందించారు. సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయింది. “మోసగాళ్లకు మోసగాడు’ చిత్రానికి కథ అందించిన ఆరుద్రను దర్శకత్వం చేయమని సూపర్ స్టార్ కృష్ణ అడిగారు. తాను ఈ సినీ పరిశ్రమలో రచయితగానే కొనసాగుతా దర్శకత్వం చేయాలంటే ఇంకా ఎక్కువ పనిభారం మోయాల్సి ఉంటుంది. అని తనకు మోసగాళ్లకు మోసగాడు చిత్రానికి దర్శకత్వం చేసే అవకాశం వచ్చినా సున్నితంగా తిరస్కరించారు.
యాక్షన్ చిత్రాల దర్శకుడిగా దాస్ పేరుండడం, అప్పటికే “రౌడీరాణి” చిత్రం విజయం సాధించడంతో.. హీరో కృష్ణ ఆయనకు అవకాశం ఇచ్చారు. అలా KSR దాస్ కు మోసగాళ్లకు మోసగాడు చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది.

“రౌడీరాణి” విజయలలిత కథానాయికగా వెలువడిన క్రైమ్‌ థ్రిల్లర్ సినిమా. తెలుగులో ఇలాంటి సినిమాలకు మార్గదర్శకంగా నిలిచింది. కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో అట్లూరి శేషగిరిరావు నిర్మించిన ఈ సినిమా 1970, అక్టోబర్ 23న విడుదలయ్యింది. జమీందారు జగన్నాథరావును, అతని భార్యను, కూతురును, కొడుకును బందిపోటు దొంగలు దారుణంగా హత్యచేసి దోచుకుంటారు. దొంగల చేతుల్లోనుండి చిన్నారి కూతురు రాణి మాత్రం తప్పించుకుంటుంది. ఇంటి నౌకరు శిక్షణలో అందమైన రౌడీ రాణిగా పెరుగుతుంది. రాణికి తన కుటుంబాన్ని చంపిన నలుగురు హంతకుల పోలికలు బాగా గుర్తున్నాయి. ప్రతీకార వాంఛతో వారిని తుదముట్టించడానికి ఓ గుర్రం మీద బయలుదేరుతుంది.
ఆ నలుగురు హంతకులలో ఒకడైన భీమరాజు మెక్సికన్ స్టైల్లో ఒక క్లబ్బును నడుపుతూ బ్యాంకులను దోచుకుంటూ ఉంటాడు.

రెండవవాడైన రత్తయ్య బందిపోటు దొంగతనంలో స్థిరపడిపోయి, పల్లెపడుచులను చెరపడుతూ ఉంటాడు. మూడవ వాడైన నాగులు తన భయంకరమైన రూపాన్ని మార్చుకుని దయానిధి అనే ప్రజాసేవకునిగా చలామణీ అవుతుంటాడు. రైలు దోపిడీలు కూడా చేస్తుంటాడు. నాలుగో వ్యక్తి పాపారావు నిజంగా పాపాలరాయుడే. రాణి తన సహాయకుడు ఏడుకొండలు సహాయంతో ఈ నలుగురినీ ఎలా శిక్షించిందీ చిత్రంలోని తరువాతి కథ.కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో ఇదే చిత్రాన్ని హిందీ భాషలో విజయలలితను కథానాయికగా రాణీ మేరా నామ్‌ పేరుతో 1972లో పునర్నిమించారు. ఈ చిత్రంలో శ్రీదేవి బాలతారగా తొలిసారి హిందీ సినిమాలో నటించింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago