Categories: Featured

Shoban Babu : టీవీ సీరియల్ “జానకి కలగనలేదు” అనే టైటిల్ ఏ సినిమాలోని పాట నుంచి తీసుకున్నారో మీకు తెలుసా.?!

Shoban Babu : సినిమాలు ఎన్ని విడుదలైన సీరియల్ కుండే ప్రత్యేకతే వేరు. ఈనాడు తెలుగు కుటుంబాలన్నీ టెలివిజన్ కి అతుక్కుపోయి చూస్తున్నారంటే దానికి ప్రధాన కారణం సినిమా టికెట్ ధరలు విపరీతంగా పెరగడం. అదేవిధంగ కొత్త సినిమాలు OTTలో ప్రత్యక్షమవుతున్నాయి. ఓ రెండు నెలలు గడవగానే టీవీలో ప్రసారం అవుతున్నాయి. ఈ క్రమంలో టీ.వి సీరియల్స్ జనరంజకంగా మారాయి అనడంలో సందేహం లేదు. అలా ఈ మధ్యకాలంలో విజయవంతంగా ప్రసారమవుతున్న “జానకి కలగనలేదు” సీరియల్ ఆంధ్ర, తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజాదరణ పొందుతూ… ప్రేక్షకుల అభినందనలు అందుకుంటుంది.

అయితే ఈ సీరియల్ “స్టార్ మా”లో ప్రతి సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 9:00 గం.లకు ప్రసారమవుతుంది. టీవీ సీరియల్ “జానకి కలగనలేదు” టైటిల్ ఒకప్పటి తెలుగు సినిమా విజయవంతమైన పాటలోని పల్లవిని తీసుకొని ఈ సీరియల్ కి టైటిల్ గా పెట్టడం జరిగింది. అందాల నటుడు శోభన్ బాబు విస్తృతంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న తెలుగు సినిమా కథా నాయకుడు. అధికంగా కుటుంబ కథా భరితమైన, ఉదాత్తమైన వ్యక్తిత్వం కలిగిన పాత్రలలో రాణించాడు. తన చలన చిత్ర జీవితంలో ముఖ్యంగా ప్రేమ కథలలో అతను ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించి ఆంధ్రుల అందాల నటుడిగా తెలుగు వారి మదిలో నిలిచిపోయారు.

1983 తోడునీడ, రఘురాముడు, ముందడుగు లాంటి చిత్రాల్లో శోభన్ బాబు నటించారు. ఇదే సంవత్సరం సోగ్గాడు శోభన్ బాబు, జయసుధ హీరో, హీరోయిన్ గా మరొక చిత్రంలో నటించారు. “రాజకుమార్” 1983లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీనాథ్ మూవీస్ పతాకంపై ఆలపాటి రంగారావు నిర్మించిన ఈ సినిమాకు గుత్తా రామినీడు దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, జయసుధ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతాన్నందించాడు. ఈ చిత్రానికి కన్నడ భాషలో విజయవంతమైన “చళిసువ మోడగలు” అనే సినిమా మాతృక. ఈ చిత్రంలో పాటలు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాయి.

ఇళయరాజా స్వరపరిచిన ఓ సందర్భోచిత గీతాన్ని.. బాలసుబ్రహ్మణ్యం, సుశీల ఆలపించారు. “జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఆనాడు.. రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు…ఆనాడు ఎవరు అనుకోనిదీ… ఈనాడు మనకు నిజమైనది…ఆ రామాయణం మన జీవన పారాయణం.!!”
ప్రతి తెలుగింట రామాయణం చదవని వారు ఉండరు. మన దైనందిన జీవితంలో ఇతిహాసాలు అయినా రామాయణ, మహాభారతాలు ప్రతి ఒక్కరితో పెనవేసుకొని ఉన్నాయి. అయితే ఇతిహాసాలు నిజజీవితానికి దగ్గరగా ఉంటాయని.. ఒక జంట వారి సంసారాన్ని తీసుకొని అందులో రామాయణంను స్పురిస్తూ…రచయిత వేటూరి సుందరరామ్మూర్తి రాసిన ఈ పాట ఆనాటి ప్రతి సినీ ప్రేక్షకుడిని ఆకట్టుకుందనడంలో సందేహం లేదు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago