టాలీవుడ్ యంగ్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఆర్ఆర్ఆర్” సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమాలు రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో చరణ్ లుక్ మొత్తం మారిపోయింది. ఇప్పటికీ ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
తాజాగా స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుంచి ‘దోస్తీ’ అంటూ సాగే ఈ పాటను విడుదల చేశారు. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది మెగా, తారక్ అభిమానులను ఆకట్టుకుంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించిన ఈ పాటకు ఎం ఎం కీరవాణి సంగీతం సమకూర్చారు.
ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కడంతో ఈ పాటను ఐదు భాషలలో ఐదు మంది సింగర్స్ ఎంతో అద్భుతంగా పాడారు. ప్రస్తుతం ఈ పాట నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్ విషయానికి వస్తే ఎంతో అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఈ సినిమాలో చరణ్ లుక్ చూస్తుంటే మీసకట్టు.. ఆ కళ్ళలో కనపడుతున్న పౌరుషం చూస్తుంటే ఈ సినిమా “మగధీరను” మించిపోయేలా ఉందనిపిస్తోందని బాలీవుడ్ ఫిల్మ్ అనలిస్ట్ రాహుల్ వర్మ ప్రశంసలు కురిపించారు.
ఈ సందర్భంగా రామ్ చరణ్ లుక్ పై రాహుల్ వర్మ ట్వీట్ చేయడంతో.. ఈ ట్వీట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నటువంటి రామ్ చరణ్ సరసన సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ నటిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…