ఇండస్ట్రీలో విజయ్ సేతుపతి స్టామినా ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం తమిళంతో పాటు, తెలుగులో కూడా ఎంతో ప్రేక్షకాదరణ పొందిన విజయ్ సేతుపతి హీరో సందీప్ కిషన్ తో ఓ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రంజిత్ జయకొడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది వరకు విడుదలైన “ది ఫ్యామిలీ మెన్”, ‘స్త్రీ’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన రాజ్ అండ్ డీకే ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికీ దర్శకుడు వీరితో కలిసి సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నటించడానికి ఇద్దరు హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ సినిమాకు లైన్ క్లియర్ అయింది. ఈ క్రమంలోనే అక్టోబర్ నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది.
ఇదివరకే రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ మెన్ ఫస్ట్ సిరీస్ లో సందీప్ కిషన్ నటించారు. అదే విధంగా రాజ్ అండ్ డీకే డైరెక్షన్‌లో రానున్న “సన్నీ”(వర్కింగ్ టైటిల్) వెబ్ సిరీస్ లో విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు వేరువేరు చిత్రాల ద్వారా పరిచయమైన ఈ హీరో లిద్దరినీ ఒకే సినిమాలో చూపించబోతున్నారు.
ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న టువంటి ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ లో షూటింగ్ జరుపుకోనున్నట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…