RRR Collections: ఫస్ట్ వీక్ 710 కోట్ల కలెక్షన్లను రాబట్టిన ఆర్ఆర్ఆర్..!
RRR Collections: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన చిత్రం RRR. పాన్ ఇండియా స్థాయిలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా కోసం నాలుగు సంవత్సరాల నుంచి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు.ఈ క్రమంలోనే ఈ సినిమా గత నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుని సందడి చేసింది. ఇక ఇండియాలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ ఏర్పడి బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా విడుదల అయ్యి వారం రోజులు పూర్తి చేసుకుంది.
ఇక వారం రోజులలో ఈ సినిమా ప్రదర్శన తర్వాత వరల్డ్ వైడ్ 710 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే బాహుబలి సినిమా రికార్డులను బ్రేక్ చేసిన RRR ఈ వీకెండ్ కి వెయ్యి కోట్లు క్రాస్ చేస్తుందని చెప్పవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలలో మూడు వందల కోట్ల కలెక్షన్లను క్రాస్ చేసిన ఈ సినిమా హిందీలో వంద కోట్లను క్రాస్ చేసింది.
ఓవర్సీస్‌లోనూ ఇప్పటివరకు రూ.73 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా, కొమురంభీమ్ పాత్రలో ఎన్టీఆర్ ప్రేక్షకులను సందడి చేశారు. అలియా భట్ సీత పాత్ర ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.నాలుగు సంవత్సరాల నుంచి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడిన ఎన్టీఆర్ , రామ్ చరణ్ లకు ఈ సినిమా మంచి విజయాన్ని సాధించిందని చెప్పాలి.
తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య…
వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయంగా ఉపయోగించే “బాదం…
సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ శృతి హాసన్ మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది.…
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…