ఎన్టీఅర్, రామ్ చరణ్, అజయ్ దేవగణ్, అలియా భట్ వంటి భారీ తారాగణం, హై టెక్నికల్ వాల్యూస్‌తో భారీ అంచనాతో విడుదలైన ఈ సినిమా అందరి ప్రసంశలు అందుకుంటుంది. సౌత్, నార్త్ అని తేడా లేకుండా ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. చరణ్, తారక్ ల నటనకు ఫిదా అయిపోతున్నారు ప్రేక్షకులు.. ఈ నేపధ్యంలో ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదిక ద్వారా తమ అభిప్రాయాలు తెలుపుతున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఈ సినిమాపై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు.
తాజగా ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా ఆర్ఆర్ఆర్ సినిమాపై స్పందించారు. తన అనుచరులతో కలిసి సినిమా చూసిన సీతక్క ట్విట్టర్ వేదికగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యాయి. ఆర్ఆర్ఆర్ సినిమాన ప్రశంశిస్తూనే ‘ది కాశ్మీరీ ఫైల్స్’ సినిమా పై మండి పడ్డారు. “దేశాన్ని విడదీయాలనుకుంటే ‘ది కాశ్మీరీ ఫైల్స్’ సినిమాను చూడండి. దేశాన్ని ఐక్యం చేయాలనుకుంటే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని చూడండి” అంటూ సీతక్క ట్వీట్ చేసారు. అదే క్రమంలో తారక్, చరణ్ ఇద్దరూ అద్భుతంగా నటించారని ప్రశంశించారు. అలాగే ఆర్ఆర్ఆర్ సినీమాకు అన్ని రాష్ట్రాల్లోనూ పన్ను మినాహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేసారు సీతక. ప్రస్తుతం సీతక్క వ్యాఖ్యలు నేట్టింట వైరల్ అయ్యాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…