Manchu Manoj : హీరో మంచు మనోజ్ కు హైదరాబాద్ టోలీచౌకీ ట్రాఫిక్ పోలీసుల నుంచి ఊహించని చేదు సంఘటన ఎదురయింది. ఇటీవల హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వరుసపెట్టి స్పెషల్ డ్రైవ్‌లు చేపడుతున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా వాహనాలకు ఉన్నటువంటి బ్లాక్ సీలింగ్, బ్లాక్ ఫిల్మ్ ఉన్న కార్లను ఆపి మరీ తీసేసి చలాన్ విధిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కార్లకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌ను తొలగించిన విషయం తెలిసిందే.. తాజాగా మంచు మనోజ్ కారుకున్న బ్లాక్ ఫిల్మ్‌ను తొలగించడమే కాక.. ఆయన కార్ కు చలాన్ కూడా విధించారు.
మెహిదీపట్నం, టోలిచౌకీలో తనిఖీ చేస్తున్న సమయంలో మంచు మనోజ్ AP 39HY 0319 కారులో ప్రయాణిస్తూ కనిపించారు. ఆయన కారును అడ్డుకున్న ట్రాఫిక్ పోలీసులు.. వెంటనే కారుకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ తొలగించి ఆయనకు 700 రూపాయల చలాన్ కూడా విధించి పంపించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…