Featured

Swayamvaram : ఒకే టైటిల్ తో వచ్చిన ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలా ఆడాయో తెలుసా.?!

దర్శకరత్న దాసరి “తాతామనవడు” చిత్రంతో సినీ ప్రయాణం మొదలు పెట్టిన ఆయన అనతికాలంలోనే రచన, దర్శకత్వంలో రాణించారు. అలా ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి స్టార్ హీరోలతో విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. ఆ క్రమంలో 1975 శోభన్ బాబు శారద హీరోహీరోయిన్లుగా దాసరి నారాయణరావు “బలిపీఠం” చిత్రం రూపొందించారు. ఈ సినిమా నుండి దాసరి-శోభన్ బాబు కాంబినేషన్ మొదలైంది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో మరొక విజయవంతమైన చిత్రం రూపొందించబడింది.

1982, లక్ష్మీ గణేష్ బ్యానర్, దాసరి నారాయణరావు దర్శకత్వంలో “స్వయంవరం” చిత్రం విడుదల అయ్యింది ఈ సినిమాలో శోభన్ బాబు, జయప్రద హీరో, హీరోయిన్ లుగా నటించారు. స్వయంకృషితో వ్యాపారంలో అభివృద్ధి లోకి వచ్చిన ఇద్దరు బావ బావమరుదులు, వాళ్ళిద్దరి మధ్య ఏర్పడే పొరపొచ్చాల వల్ల అప్పటికే ప్రేమలో ఉన్న వాళ్ళ పిల్లలు పడే బాధలు ఈ చిత్ర ముఖ్య కథాంశం. శోభన్ బాబు జయప్రద నటన చెల్లపిల్ల సత్యం అందించిన గీతాలు సినిమాని విజయంవైపు తీసుకెళ్లాయి. ప్రధానంగా జేసుదాసు ఆలపించిన “గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం”.. “ఆకాశం ఎందుకో పచ్చ పడ్డది ఆ నడుమ బొట్టేమో ఎర్ర పడ్డది” అనే పాటలు ఈ సినిమా ఘన విజయానికి తోడ్పడ్డాయి.

వేణు స్నేహితుడైన వెంకట శ్యామ్ ప్రసాద్ ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ అనే సినీ నిర్మాణ సంస్థ స్థాపించాడు. ఆ సంస్థ సారథ్యంలో కె.విజయ భాస్కర్ దర్శకత్వంలో 1999లో వచ్చిన “స్వయంవరం” అనే సినిమా వేణు తొలి సినిమా. ఇందులో లయ కథానాయికగా నటించింది. లయకు కూడా ఈ సినిమా మొదటిది. నేటి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి కథ మాటలు అందించడం విశేషం. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది. స్వయంవరం సినిమాలో నటనకు వేణుకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. తరువాత ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ సారథ్యంలోనే 2000లో వచ్చిన “చిరునవ్వుతో” అనే సినిమా కూడా విజయాన్ని చవిచూసింది.

నట శిక్షకుడు ఎన్.జె. భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు స్వయంవరం విజయం తరువాత వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన వేణు గారు ఎక్కువగా తన సొంత బ్యానర్ ఎస్.పి ప్రొడక్షన్స్ లోనే సినిమాలు చేస్తూ వచ్చారు, చిరునవ్వు తో, హనుమాన్ జుంక్షన్, గోపి గోపిక గోదావరి వంటి పలు సినిమాల్లో నటించి కుటుంబ ప్రేక్షకులను అలరించారు, ఫ్యామిలీ హీరోగా వెంకటేష్ గారి తరువాత వేణు మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

23 hours ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago