దర్శకరత్న దాసరి “తాతామనవడు” చిత్రంతో సినీ ప్రయాణం మొదలు పెట్టిన ఆయన అనతికాలంలోనే రచన, దర్శకత్వంలో రాణించారు. అలా ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి స్టార్ హీరోలతో విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. ఆ క్రమంలో 1975 శోభన్ బాబు శారద హీరోహీరోయిన్లుగా దాసరి నారాయణరావు “బలిపీఠం” చిత్రం రూపొందించారు. ఈ సినిమా నుండి దాసరి-శోభన్ బాబు కాంబినేషన్ మొదలైంది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో మరొక విజయవంతమైన చిత్రం రూపొందించబడింది.

1982, లక్ష్మీ గణేష్ బ్యానర్, దాసరి నారాయణరావు దర్శకత్వంలో “స్వయంవరం” చిత్రం విడుదల అయ్యింది ఈ సినిమాలో శోభన్ బాబు, జయప్రద హీరో, హీరోయిన్ లుగా నటించారు. స్వయంకృషితో వ్యాపారంలో అభివృద్ధి లోకి వచ్చిన ఇద్దరు బావ బావమరుదులు, వాళ్ళిద్దరి మధ్య ఏర్పడే పొరపొచ్చాల వల్ల అప్పటికే ప్రేమలో ఉన్న వాళ్ళ పిల్లలు పడే బాధలు ఈ చిత్ర ముఖ్య కథాంశం. శోభన్ బాబు జయప్రద నటన చెల్లపిల్ల సత్యం అందించిన గీతాలు సినిమాని విజయంవైపు తీసుకెళ్లాయి. ప్రధానంగా జేసుదాసు ఆలపించిన “గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం”.. “ఆకాశం ఎందుకో పచ్చ పడ్డది ఆ నడుమ బొట్టేమో ఎర్ర పడ్డది” అనే పాటలు ఈ సినిమా ఘన విజయానికి తోడ్పడ్డాయి.

వేణు స్నేహితుడైన వెంకట శ్యామ్ ప్రసాద్ ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ అనే సినీ నిర్మాణ సంస్థ స్థాపించాడు. ఆ సంస్థ సారథ్యంలో కె.విజయ భాస్కర్ దర్శకత్వంలో 1999లో వచ్చిన “స్వయంవరం” అనే సినిమా వేణు తొలి సినిమా. ఇందులో లయ కథానాయికగా నటించింది. లయకు కూడా ఈ సినిమా మొదటిది. నేటి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి కథ మాటలు అందించడం విశేషం. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది. స్వయంవరం సినిమాలో నటనకు వేణుకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. తరువాత ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ సారథ్యంలోనే 2000లో వచ్చిన “చిరునవ్వుతో” అనే సినిమా కూడా విజయాన్ని చవిచూసింది.

నట శిక్షకుడు ఎన్.జె. భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు స్వయంవరం విజయం తరువాత వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన వేణు గారు ఎక్కువగా తన సొంత బ్యానర్ ఎస్.పి ప్రొడక్షన్స్ లోనే సినిమాలు చేస్తూ వచ్చారు, చిరునవ్వు తో, హనుమాన్ జుంక్షన్, గోపి గోపిక గోదావరి వంటి పలు సినిమాల్లో నటించి కుటుంబ ప్రేక్షకులను అలరించారు, ఫ్యామిలీ హీరోగా వెంకటేష్ గారి తరువాత వేణు మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు.



























