యంగ్ టైగర్ ఎన్టీఅర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు క్రేజీ స్టార్స్ తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో భారీ అంచనాతో విడుదలైన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా అందరి ప్రసంశలు అందుకుంటుంది. సౌత్, నార్త్ అని తేడా లేకుండా ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. అటు చరణ్, తారక్ ల నటనకు ఫిదా అయిపోతున్నారు ప్రేక్షకులు. అయితే కొందరు ఎన్టీఆర్ అభిమానులు మాత్రం తమ హీరోకు ఈ సినిమాలో తగిన ప్రాధాన్యం ఇవ్వలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో ఎక్కువగా రామ్ చరణ్ ను హైలైట్ చేసారంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఇటువంటి వీరాభిమానుల వల్ల హీరోలు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో ప్రముఖ ప్రవచానకర్త గతంలో ఎంతో వివరంగా చెప్పారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా నేపధ్యంలో మాటలు ప్రస్తుతం నేట్టింట హల్చల్ చేస్తున్నాయి. యాదృశ్చికమో ఏమో తెలియదు గానీ గతంలోనే జూనియర్ ఎన్టిఆర్ పేరును ప్రస్తావిస్తూ గరికపాటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సరిగ్గా మరోసారి వైరల్ అవుతున్నాయి. ఆయన వ్యాఖ్యలు చూస్తె.. “సమాజంలో పేరు ప్రఖ్యాతలు గడించిన వారు స్పష్టంగా లేకపోతె జారిపోతారు అందులో ఎటువంటి మొహమాటం లేదు. అభిమానుల ఆశల ప్రకారమే వాళ్ళు బ్రతకాలా? సచిన్ టెండూల్కర్ అనుభవిస్తున్న అవస్థ, జూ.ఎన్టీఆర్ అనుభవిస్తున్న అవస్థ మీకు మొహామాటం లేకుండా నేను చెబుతున్నాను. అభిమానుల అంచనాల ప్రకారమే వాళ్ళు ఉండాలి? హీరో వేషమే వేయాలా? ఏం గుమస్తా వేషం వేయకూడదా? ఒక విలన్ వేషం వేయకూడదా? అతనిలోని నటుడుని మీరు బయటకు రానివ్వరా? క్రికెట్ లో ఎవడైనా ఓడిపోగానే పెద్ద బాధ పడిపోతారు.
అందుకోసం మనం ప్రాణాలు తీసుకోవడం, టెండూల్కర్ కు వేలు నొప్పి పెడితే మనం ఆంజనేయస్వామికి అభిషేకం చేస్తామా? అతనిలాగ నువ్వు తయారవ్వాలని ఉండదు అతని వేలు కోసం పూజ చేస్తారు. క్రీడా అన్నాక ఒకసారి ఓడిపోతారు ఒక్కోసారి గెలుస్తారు.. ఆటలు ఆటలు లానే చూడాలి యుద్దంలా చూడకూడదు. క్రీడాకారుల మీద, కళాకారుల మీద ఎప్పుడూ ఒత్తిడి పెంచకూడదు. సినిమా హీరోలు విపరీతంగా ఒత్తిడికి లోనవుతున్నారు.. ఒక సినిమా విజయవంతం కాగానే అయన ఇలానే ఉండాలి.. ఇంకోలా ఉండటానికి వీలులేదు అంటూ అభిమానుల గొడవ. ఈ అభిమానుల అంచనాల మేరకు హీరోలు ఉండాలా?అతడిని నటుడిగా ఎదగనివ్వరు..
ఎన్టీరామారావు, నాగేశ్వరావు, ఎస్వీ రంగారావు తరాన్ని మీరు గమనించండి. కారు డ్రైవర్ పాత్ర నుంచి ఖర్మగారం అధిపతి వరకు అన్ని పాత్రలు పోషించారు. దేనికీ అవమాన పడలేదు. కానీ నటుడు నటుడే దర్శకుడు దర్శకుడే. అతను చెప్పింది వినాలంతే.. సీతారామయ్య గారి మనవారలు సినిమాలో నేను ఆశించినట్టుగా రాలేదు అని డైరెక్టర్ అంటే.. ఏమి అనుకోకు అబ్బాయ్ నేను మళ్ళీ చేస్తాను అని రెండు చేసారు నాగేశ్వరావు గారు. దర్శకుడిని గౌరవించడం నటుడి విధి. భారతీయతత్వం ఎప్పుడూ అంతే అలాగే ఉండాలి.” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది మరి మీరు కూడా చూసేయండి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…