యంగ్ టైగర్ ఎన్టీఅర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు క్రేజీ స్టార్స్ తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో భారీ అంచనాతో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సినిమా ఆర్ఆర్ఆర్. సౌత్, నార్త్ అని తేడా లేకుండా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. అటు చరణ్, తారక్ ల నటనకు ఫిదా అయిపోతున్నారు ప్రేక్షకులు. దర్శకధీరుడు రాజమౌళీ తెరకెక్కించిన ఈ సినిమా ఇండియాలోనే కాదు ప్రపంచ దేశాల్లో విజయదుంధుబి మోగిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు తిరగరాస్తుంది.
హాలీవుడ్ సినిమాలను సైతం పక్కకు నెట్టి ఇండియన్ సినిమా సత్తా నిరూపిస్తుంది ఆర్ఆర్ఆర్ సినిమా. ఈ సినిమాకు విదేశీ ప్రేక్షకులు సైతం ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో ఒక విదేశీ ప్రేక్షకుడు చేసిన ట్వీట్ నేట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఏషియన్ సినిమాల్లో ‘ఐపీ మ్యాన్’ సినిమా తరువాత తనకు నచ్చిన సినిమా ఆర్ఆర్ఆర్ మాత్రమేనని, ఇక బాలీవుడ్ సినిమాలను బ్రష్ చేయాలని ట్వీట్ చేసాడు రోన్ ఫిలిప్స్ అనే విదేశీయుడు.
విదేశీయుడి ట్వీట్ పై స్పందించిన ఆర్ఆర్ఆర్ టీమ్ స్పందించింది. ‘ట్రిపుల్ ఆర్ ఒక ఇండియన్ సినిమా’ అంటూ ట్వీట్ చేసింది.. ఇండియన్ సినిమాలను వేరు చేసి చూడొద్దు అనే అర్ధం వచ్చేలా ఆర్ఆర్ఆర్ మంచి సమాధానం ఇచ్చిందని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య…
వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయంగా ఉపయోగించే “బాదం…
సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ శృతి హాసన్ మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది.…
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…