Movie News

ఆర్ఆర్ఆర్ విషయంలో తగ్గేదేలేదంటున్న రాజమౌళి.. ఆందోళనలో నిర్మాతలు?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నటువంటి చిత్రం ఆర్ఆర్ఆర్. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటి వరకు చరిత్రలో కలవని ఇద్దరు యోధులను ఈ సినిమాలు కలుపుతూ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించినట్టు తెలుస్తోంది.

అయితే ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా మరోసారి సినిమా వాయిదా పడి జనవరి 7వ తేదీ విడుదల కానుంది. ప్రస్తుతం షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి ప్రస్తుతం మరొక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఈ సినిమా రన్ టైమ్ దాదాపు మూడు గంటలకు పైగా ఉందట. అయితే ఈ సినిమాను కట్ చేస్తూ రాజమౌళి రెండు గంటల 45 నిమిషాలకు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇక ఈ సినిమాలో ఎలాంటి ట్రిమ్ ఉండదని ఈ సినిమా ఫైనల్ అవుట్ పుట్ ఇదేనని రాజమౌళి తేల్చిచెప్పారు.

ఈ సినిమా రన్ టైమ్ విషయంలో ఎవరెన్ని చెప్పిన రాజమౌళి తగ్గేది లేదు అంటూ ఫిక్స్ అయిపోయారు. ఇలా సినిమా రెండు గంటల 45 నిమిషాల రన్ టైం ఉండడంతో నిర్మాతలు కొంతమేర ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ సినిమా జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టీజర్ అక్టోబర్ 29వ తేదీన అన్ని భాషలలో విడుదల కానుందని చిత్ర బృందం అధికారికంగా తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నైటీ వేసుకుందన్న కోపం.. భార్యపై నిప్పంటించిన భర్త

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…

3 hours ago

సైన్స్ vs నమ్మకాలు.. పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…

3 hours ago

మెగాస్టార్ ఇంటి పక్కనే అల్లు అర్జున్ కలల గృహం.. రూ.80 కోట్ల మేన్షన్ నిర్మాణం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…

3 hours ago

నాదెండ్ల భాస్కర్ రావు ఇకలేరు.. విభిన్న రాజకీయ ప్రయాణం ముగిసింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…

3 hours ago

స్టార్ హీరోలు కూతుళ్లను సినిమాల్లోకి ఎందుకు పంపరంటే.. జేడీ షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…

3 hours ago

పెళ్లి ముందు రాత్రే షూటింగ్..రమ్యకృష్ణ డెడికేషన్‌కు ఫిదా

సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…

3 hours ago