తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నటువంటి చిత్రం ఆర్ఆర్ఆర్. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటి వరకు చరిత్రలో కలవని ఇద్దరు యోధులను ఈ సినిమాలు కలుపుతూ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించినట్టు తెలుస్తోంది.

అయితే ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా మరోసారి సినిమా వాయిదా పడి జనవరి 7వ తేదీ విడుదల కానుంది. ప్రస్తుతం షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి ప్రస్తుతం మరొక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఈ సినిమా రన్ టైమ్ దాదాపు మూడు గంటలకు పైగా ఉందట. అయితే ఈ సినిమాను కట్ చేస్తూ రాజమౌళి రెండు గంటల 45 నిమిషాలకు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇక ఈ సినిమాలో ఎలాంటి ట్రిమ్ ఉండదని ఈ సినిమా ఫైనల్ అవుట్ పుట్ ఇదేనని రాజమౌళి తేల్చిచెప్పారు.
ఈ సినిమా రన్ టైమ్ విషయంలో ఎవరెన్ని చెప్పిన రాజమౌళి తగ్గేది లేదు అంటూ ఫిక్స్ అయిపోయారు. ఇలా సినిమా రెండు గంటల 45 నిమిషాల రన్ టైం ఉండడంతో నిర్మాతలు కొంతమేర ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ సినిమా జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టీజర్ అక్టోబర్ 29వ తేదీన అన్ని భాషలలో విడుదల కానుందని చిత్ర బృందం అధికారికంగా తెలియజేశారు.






























