Movie News

RRR Movie: రాజ్యసభలో ఆస్కార్ అవార్డుల పై ప్రశంసల జల్లు.. తెలుగోడి దెబ్బకు దద్దరిల్లిన రాజ్యసభ!

RRR Movie: ఆస్కార్ అవార్డుల వేడుకలు ఎంతో ఘనంగా జరిగిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పటివరకు భారత్ కి ఒక ఆస్కార్ అవార్డు కూడా రాకపోగా ఈ ఏడాది మాత్రం ఏకంగా రెండు ఆస్కార్ అవార్డులు రావడంతో దేశం మొత్తం ఈ విజయాన్ని సంబరంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాజ్యసభలో కూడా ఈ అవార్డులపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఆస్కార్ అవార్డు వేడుకలలో భాగంగా బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌గా అవార్డు గెలుచుకున్న ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ టీమ్‌కు, అలాగే ది ఒరిజినల్ సాంగ్ క్యాటగిరి లో భాగంగా నాటు నాటు పాటకగాను ఆస్కార్ గెలుచుకున్నటువంటి త్రిబుల్ ఆర్ చిత్ర బృందానికి రాజ్యసభ చైర్మన్‌ జగ్దీప్ ధన్‌ఖర్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇక ఈయన ఈ అవార్డు వేడుకల గురించి మాట్లాడుతూ నాటు నాటు అని ప్రస్తావించగానే ఒక్కసారిగా రాజ్యసభ మొత్తం చప్పట్లతో దద్దరిల్లిపోయింది. ఇలా ఇండియాకు రెండు ఆస్కార్ అవార్డులు రావడంతో ఈ విజయాలు
భారతీయ కళాకారుల అపారమైన ప్రతిభ, అపారమైన సృజనాత్మకత అంకితభావాని తెలియజేస్తాయన్నారు. నిజానికి ఇది మన గ్లోబల్‌ గుర్తింపు అంటూ ప్రశంసించారు.

RRR Movie: తెలుగు చిత్ర పరిశ్రమకి గర్వకారణం ..


ఇలా రాజ్యసభలో ఆస్కార్ వేడుకల గురించి మాట్లాడుతూ ఆస్కార్ గెలుచుకున్నటువంటి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ఆస్కార్ వంటి గొప్ప అవార్డును తెలుగు చిత్ర పరిశ్రమ అందుకోవడంతో ఇది తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణం అని, ముందు ముందు ఇలాంటి గొప్ప ప్రతిష్టాత్మకమైన అవార్డులను మరెన్నో అందుకోవాలంటూ ఆకాంక్షిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago