Suchitra Chandrabose : ఇప్పుడు దేశం మొత్తం నాటు నాటు పాట గురించే మాట్లాడుకుంటూ ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా ఇప్పుడు అవార్డుల పంట కూడా పండిస్తోంది. గతంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు నాటు నాటు పాటకు రాగా ఇప్పుడు ఏకంగా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును కొట్టేసింది. పాట రచయిత చంద్రబోస్ గారికి మ్యూజిక్ కంపోజర్ కీరవాణి గారికి ఆస్కార్ అవార్డు రావడంతో ఇండియన్స్ మొత్తం గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఇక తన భర్తకు ఆస్కార్ అవార్డు రావడం గురించి తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు సుచిత్ర చంద్రబోస్.
ఎమోషనల్ అయిన సుచిత్ర చంద్రబోస్…
భర్త చంద్రబోస్ కి ఆస్కార్ అవార్డు రావడంతో తన ఆనందాన్ని పంచుకున్నారు సుచిత్ర చంద్రబోస్. తాను రాసిన పాటకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం ఆనందాన్నిచ్చిందని చెప్పారు. ఇక వేదిక మీద చంద్రబోస్ గారు మాట్లాడుతూ నా కుటుంబానికి ఈ అవార్డును చూపించాలని ఉందంటూ స్పీచ్ లో చెప్పడం గురించి మాట్లాడుతూ కుటుంబం మొత్తం ఆనందంగా ఫీల్ అయ్యారంటూ చెప్పారు. తన సోదరులు సోదరీమనులు అందరూ చాలా హ్యాపీ అయ్యారని చెప్పారు. తన విజయం కోసం నా కంటే తన సోదరులు, సోదరీమనులు బాగా ఎదురుచూసారని తెలిపారు.
ఇక తన భర్త కీరవాణి గారు అవార్డు అందుకోవాలని నామినేషన్స్ లో ఉన్నప్పటి నుండి దేవుడికి పూజలు చేస్తున్నట్లు తెలిపారు. భర్త సక్సెస్ ను చూస్తేంటే ఆనందంగా ఉందంటూ ఎమోషనల్ అయ్యారు సుచిత్ర. అవార్డు అనౌన్స్ చేయగానే కళ్ళలో నీళ్లు తిరిగాయంటూ చెప్పారు. ఇక నాటు నాటు పాటలో బాగా నచ్చిన పదం నాటు అంటూ అది ప్రపంచ వ్యాప్తంగా అందరికీ చేరువయింది అంటూ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…