Shiva Shakthi Datha : ప్రస్తుతం తెలుగు సినిమాను అంతర్జాతీయ వేదిక మీద ఉంచి తెలుగు సినిమా గౌరవాన్ని అలాగే ఇండియన్ సినిమా గౌరవాన్ని నిలబెట్టిన ఘనత డైరెక్టర్ రాజమౌళికి దక్కుతుంది. రాజమౌళి గారి సినిమా అంటే అది ఫ్యామిలీ ప్యాకేజ్. వాళ్ళ ఇంట్లో దాదాపు అందరూ సమిష్టిగా కృషి చేసి సినిమాను తీస్తారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తే కీరవాణి సంగీతం, కీరవాణి భార్య వల్లి గారు ప్రొడక్షన్ చూసుకుంటే రమ రాజమౌళి కాస్టుమ్స్ చూసుకుంటారు. ఇక కీరవాణి కొడుకు కాల భైరవ పాటలు పడుతారు. ఇక రాజమౌళి కొడుకు కార్తీక్ కూడా సినిమాలో పనిచేస్తున్నారు. ఇలా మొత్తం కుటుంబం పనిచేస్తూ సక్సెస్ కొడుతున్నారు. ఇక రాజమౌళి కీరవాణిల తండ్రులు ఇద్దరూ సోదరులు, వాళ్ళది ఉమ్మడి కుటుంబం. ఇండస్ట్రీలో పెద్ద కుటుంబంగా కీరవాణి, రాజమౌళి గారి కుటుంబం ఉంది. రాజమౌళి గారి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారు అలాగే కీరవాణి గారి తండ్రి శివ శక్తి దత్త గారు అన్నదమ్ములు.
91 ఏళ్ల వయసులో సినిమా చేస్తున్న కీరవాణి ఫాదర్…
సినిమా తీయాలనే కోరికతో చెన్నైకి వచ్చిన శివ శక్తి దత్త గారు ఇప్పటి వరకు ఆ అవకాశం రాక ఎదురుచూశారు. ప్రస్తుతం ఆయన వయసు 91సంవత్సరాలు అయినా కూడా ప్రస్తుతం ‘తిరుమల నాయక’ అనే సినిమాకు దర్శకుడిగా చేస్తున్నారు. స్వాతహాగా ఆర్టిస్ట్ అయిన ఆయన ఎన్నో పెయింటింగ్స్ వేశారు. ఇక ఆయన ఈ వయసులో కూడా చాలా ఫిట్ గా అలానే ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఆయన ఆర్టిస్ట్ అవడమే అంటూ చెప్తారు.
అదీ కాక దేవుడు మనకు ఆరోగ్యం ఇవ్వడం కూడా వరమే అంటూ చెబుతారు శివ శక్తి దత్త, దాన్ని కాపాడుకోవడం మన చేతిలో ఉంటుందంటూ చెప్పారు. ఒక ఆర్టిస్ట్ గా ముందు నుండి అందం మీద అలంకారం మీద మక్కువ ఎక్కువని అందుకే శరీరం మీద, ఆరోగ్యం మీద దృష్టి పెడతానంటూ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…