బాలీవుడ్ భామ అలియా భట్ ప్రత్యేకమైన పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. విభిన్న పాత్రలలో నటించి అందరిని ఆకట్టుకున్న అలియా, ప్రస్తుతం తెలుగులో దర్శకధీరుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్. ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం మనకు తెలిసినదే. ఈ సినిమాలో ప్రముఖ హీరోలయిన రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్ర నిర్మాణం పూర్తి చేసుకొని విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణం వల్ల వేసవి సెలవులలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రామ్ చరన్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి పాత్రల పై టీజర్ లు విడుదలయ్యాయి. ఈ టీజర్స్ కి మంచి వ్యూస్ రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు దర్శక నిర్మాతలు.
అయితే ఈ సినిమాలో అల్లు సీతారామరాజు పాత్రలో, రామ్ చరణ్ సరసన సీత పాత్రలో బాలీవుడ్ ప్రముఖ నటి అలియా భట్ నటించనున్నారు. తాజాగా రామ్ చరణ్, అలియా పై దర్శకుడు కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ముందుగా ఓ పాట చిత్రీకరణ జరుగుతుందని సమాచారం. చారిత్రాత్మక నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషించనున్నాడు. ఈ చిత్రం షూటింగ్లో భాగంగా అలియా ఈ చిత్ర బృందం కలిసిపోయింది.
అయితే అలియా భట్ తనతో పాటు పదిమంది పర్సనల్ స్టాప్ ను కూడా వెంట తీసుకొచ్చారు. అయితే వీరందరి ఖర్చులు కూడా చిత్ర నిర్మాత భరించాల్సి ఉంటుంది.అలియా స్టాప్ మొత్తానికి కలిపి రోజుకు దాదాపు లక్ష రూపాయల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుండడంతో నిర్మాతకు బాగానే ఖర్చవుతుందని తెలుస్తుంది. బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన అలియాభట్ కోసం చేసేదేమీ లేక నిర్మాత పెద్ద మొత్తంలోనే ఖర్చు చేస్తున్నాడని తెలుస్తోంది.
రోజుకు ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుండడంతో, అలియా పై ఉన్న సన్నివేశాలను తొందరగా చిత్రీకరణ పూర్తి చేస్తున్నారు దర్శకుడు. అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించే ఈ చిత్రం కోసం నిర్మాత డివివి దానయ్య సుమారు 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.
చాలామంది ఇళ్లలో ఒకే సీన్ కనిపిస్తుంది. రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయాన్నే చెత్తబుట్టలో పడేయడం. “పాత అన్నం తింటే కడుపు…
దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ Regina Cassandra తాజాగా బాలీవుడ్ అనుభవాలపై సంచలన వ్యాఖ్యలు…
2026 టీ20 వరల్డ్ కప్ ఉత్కంఠభరిత దశలోకి అడుగుపెట్టింది. లీగ్ పోరాటాలు దాదాపు ముగియడంతో ఇప్పుడు అందరి చూపు సూపర్-8…
అంతరిక్ష రంగంలో కెరీర్ కలలు కనే విద్యార్థులకు ఇది మంచి అవకాశం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన విక్రమ్…
తిరుపతి నగరానికి కొద్ది దూరంలో, రేణిగుంట మండలంలోని గుడిమల్లం గ్రామంలో ఒక అపూర్వ చారిత్రక కట్టడం భక్తులను, చరిత్రాభిమానులను సమానంగా…
తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.…