“ఆర్ఆర్ఆర్” సినిమా కోసం యావత్ సినీమా ప్రపంచం చూసిన ఎదురుచూపులకు నేటితో తెరపడింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ ఎత్తున విడుదలైన #RRR మూవీ రాజమౌళీ మార్క్ తో అద్బుతమైన హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక నిన్న రాత్రి నుంచే బెనిఫిట్ షోస్, ప్రీమియర్ షోస్, ఓవర్సీస్ షోస్ మొదలవ్వడం తో ట్విట్టర్ తో పాటూ సోషల్ మీడియా మొత్తం #RRR హ్యాష్ టాగ్ టెండ్ అవుతుంది. ఈ చిత్రంలో చరణ్ – ఎన్టీఆర్ ఇద్దరూ కలిసిన నటించిన సీన్స్ ఏంతో అద్భుతంగా తీర్చి దిద్దారట డైరెక్టర్ రాజమౌళీ. మొత్తంగా ఈ సినిమా ఒక విజువల్ వండర్ అంటూ ఎటు చూసినా సూపర్ పాజిటివ్ టాక్ వినిపిస్తుంది
ఇక రామ్ చరణ్ తన భార్య ఉపాసన అభిమానులతో కలసి ఓ థియేటర్స్ లో RRR చిత్రాన్ని వీక్షించారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఎప్పుడూ సైలెంట్ గా కనిపించే రామ్ చరణ్ భార్య ఉపాసన ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని చూస్తూ తనలో మాస్ యాంగిల్ బయటకు తీసారు.. ఈ చిత్రంలో రామ్ చరణ్ యాక్టింగ్ కు ఫిదా అయిపోయిన ఆమె అభిమానులతో కలిసి పేపర్లు విసిరారు.. కేకలు, కేరింతలతో థియేటర్ లో రచ్చ రచ్చ చేసారు ఉపాసన. సినిమాలో ‘నాటు నాటు సాంగ్’ వస్తున్న సమయంలో ఉపాసన పైకి లేచి మరీ పేపర్లు విసిరారు. ఆమె చేస్తున్న అల్లరి అంతా ముందు సీట్లో కూర్చున్న కొందరు విడియో తీసారు. ప్రస్తుతం ఈ విడియో నేట్టింట వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…