General News

అందమైన దీవిలో అద్భుతమైన ఉద్యోగం.. రూ.88 లక్షలు జీతం, కానీ?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ భయంకరమైన పరిస్థితిలో బతకాలంటే భయమేస్తోంది? ఇక్కడి నుంచి ఎక్కడైనా దూరంగా వెళ్లాలని భావిస్తున్నారా? ఈ విధంగా ఆలోచించే వారికి ఒక అద్భుతమైన అవకాశం ఉంది. ఒక ప్రైవేట్ ఐలాండ్ లోని ఒక ఇంటి బాగోగులు చూసుకుంటే చాలు కరోనా వల్ల ఏర్పడిన భయం తొలగిపోతుంది. అదేవిధంగా సంవత్సరానికి మీరు ఊహించనటువంటి జీతం అందుతుంది.

ఈ ప్రైవేట్ ఐలాండ్ లో ఉన్న ఇంటిని చూసుకుంటే చాలు సంవత్సరానికి మీ అకౌంట్లో 88 లక్షల రూపాయలు జమ అవుతాయి. అయితే ఈ ఉద్యోగాన్ని చేయాలని భావించేవారుకొన్ని విషయాలలో రాజీపడి ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగం చేయడానికి కేవలం పెళ్లైన జంటకి మాత్రమే అనుమతి. ఈ ఉద్యోగానికి ఎంపికైన జంట ఫ్లొరిడా, బ్రహ్మాస్‌లో ఆ కుటుంబానికి గల అన్ని ఇళ్లల్లో పనిచేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు Polo & Tweed వెబ్‌సైట్‌లో ఉంచారు.

ఈ ఉద్యోగానికి ఎంపికైన జంటకు మంచి జీతంతో పాటు హెల్త్, డెంటల్ సౌకర్యాలతో పాటు ఒక కారును కూడా ఇస్తారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేయాల్సి ఉంటుంది. శని ఆదివారం వీకెండ్‌తోపాటు రాత్రి షిఫ్టుల్లో కూడా పనిచేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేవారు హౌస్‌హోల్డ్ మేనేజ్మెంట్, మెయింటెనెన్స్‌ అనుభవం ఉండాలి.

ఈ ఉద్యోగంలో చేరిన వారు ఆ ఇంటికి సంబంధించిన ఏ పని అయినా చేయాల్సిందే. కొన్నిసార్లు ఎయిర్ పోర్ట్ కి కారు తీసుకెళ్లి బంధువులను తీసుకురావాలి. ఈ విధంగా ఉద్యోగంలో చేరిన వారి పనితీరును జీవితకాలం తమతో పాటే ఉండవచ్చని ఆ కుటుంబం పేర్కొంది. ఏప్రిల్ 28న ఈ ఉద్యోగ ప్రకటన చేయగా ఇప్పటికే ఎంతో మంది దరఖాస్తు చేసుకున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago