ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ భయంకరమైన పరిస్థితిలో బతకాలంటే భయమేస్తోంది? ఇక్కడి నుంచి ఎక్కడైనా దూరంగా వెళ్లాలని భావిస్తున్నారా? ఈ విధంగా ఆలోచించే వారికి ఒక అద్భుతమైన అవకాశం ఉంది. ఒక ప్రైవేట్ ఐలాండ్ లోని ఒక ఇంటి బాగోగులు చూసుకుంటే చాలు కరోనా వల్ల ఏర్పడిన భయం తొలగిపోతుంది. అదేవిధంగా సంవత్సరానికి మీరు ఊహించనటువంటి జీతం అందుతుంది.

ఈ ప్రైవేట్ ఐలాండ్ లో ఉన్న ఇంటిని చూసుకుంటే చాలు సంవత్సరానికి మీ అకౌంట్లో 88 లక్షల రూపాయలు జమ అవుతాయి. అయితే ఈ ఉద్యోగాన్ని చేయాలని భావించేవారుకొన్ని విషయాలలో రాజీపడి ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగం చేయడానికి కేవలం పెళ్లైన జంటకి మాత్రమే అనుమతి. ఈ ఉద్యోగానికి ఎంపికైన జంట ఫ్లొరిడా, బ్రహ్మాస్‌లో ఆ కుటుంబానికి గల అన్ని ఇళ్లల్లో పనిచేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు Polo & Tweed వెబ్‌సైట్‌లో ఉంచారు.
ఈ ఉద్యోగానికి ఎంపికైన జంటకు మంచి జీతంతో పాటు హెల్త్, డెంటల్ సౌకర్యాలతో పాటు ఒక కారును కూడా ఇస్తారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేయాల్సి ఉంటుంది. శని ఆదివారం వీకెండ్‌తోపాటు రాత్రి షిఫ్టుల్లో కూడా పనిచేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేవారు హౌస్‌హోల్డ్ మేనేజ్మెంట్, మెయింటెనెన్స్ అనుభవం ఉండాలి.
ఈ ఉద్యోగంలో చేరిన వారు ఆ ఇంటికి సంబంధించిన ఏ పని అయినా చేయాల్సిందే. కొన్నిసార్లు ఎయిర్ పోర్ట్ కి కారు తీసుకెళ్లి బంధువులను తీసుకురావాలి. ఈ విధంగా ఉద్యోగంలో చేరిన వారి పనితీరును జీవితకాలం తమతో పాటే ఉండవచ్చని ఆ కుటుంబం పేర్కొంది. ఏప్రిల్ 28న ఈ ఉద్యోగ ప్రకటన చేయగా ఇప్పటికే ఎంతో మంది దరఖాస్తు చేసుకున్నారు.





























