Movie News

ఓ ఇంటివాడు కాబోతున్న‘ఆర్ఎక్స్ 100’ హీరో.. రహస్యంగా నిశ్చితార్థం..!

ఆర్ఎక్స్ 100 సినిమాలో ఎతో పాపులారిటీ తెచ్చుకున్న హీరో కార్తికేయ గురించి ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. ఆ సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తిపును తెచ్చుకున్నారు. మొదటి సినిమాతోనే అద్బుతమైన విజయాన్ని అందుకున్నారు కార్తికేయ. ఈ సినిమాలో బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ తో కలిసి రొమాన్స్ చేసిన ఈ హీరో ఘనమైన విజయం అందుకున్నారు.

తర్వాత కార్తికేయకు సినిమా ఇండస్ట్రీలో పలు అవకాశాలు వచ్చినప్పటికీ ఈ సినిమా తర్వాత నటించిన కార్తికేయ సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. రీసెంట్ గా వచ్చిన చావు కబురు చల్లగా కూడా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అతడు సినిమాలో ఇలా బిజీ ఉండగా.. అతడు వ్యక్తి గత విషయంలో తర్వలోనే అతడు ఓ ఇంటివాడు కోబోతున్నట్లు తెలుస్తోంది.

గుట్టుచప్పుడు కాకుండా కుటుంబసభ్యుల సమక్షంలో నిశ్చితార్థం కూడా జరుపుకున్నట్లు సమాచారం. పెద్దలు కుదిర్చిన వివాహమే కార్తికేయ చేసుకోనున్నారు. అయితే ఈ హీరో పెళ్లిచేసుకోబోయే అమ్మాయి… ఎవరు.. ఎక్కడ ఉంటుందనే విషయాలు మాత్రం తెలియరాలేదు. నిన్ననే నిశ్చితార్థం చేసుకున్న కార్తికేయ.. తన పెళ్లి, అమ్మాయి గురించి అధికారికంగా త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.

కార్తికేయ ప్రస్తుతం రాజా విక్రమార్క సినిమా షూటింగ్ లో బిజీ ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతేకాకుండా యూవీ క్రియేషన్స్ తో కలిసి ఆసక్తికరమైన ప్రాజెక్టులో కూడా కార్తికేయ నటించబోతున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ హీరో పెళ్లి విషయం గురించి మరిన్ని విషయాలు తెలియాలంటే హీరో అధికారికంగా ప్రకటించే వరకు వేచి ఉండాల్సిందే.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago