“గీతా గోవిందం” సినిమా ద్వారా వెండితెరపై హిట్ పెయిర్ గా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ -రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వీరిద్దరూ కలిసి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో ఇద్దరికీ సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వెల్లువెత్తాయి.ఈ సినిమా తర్వాత ఈ జంట మరోసారి డియర్ కామ్రేడ్ అనే చిత్రంలో నటించిన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో మంచి స్నేహితులుగా ఉండే ఈ జంట పట్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించేవి. వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని సోషల్ మీడియాలో వార్తలు షికార్లు కొట్టాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన వీరు తమ మధ్య కేవలం మంచి స్నేహబంధం మాత్రమే ఉందని పలుమార్లు తెలియజేశారు.
నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈ జంట తాజాగా ఇద్దరు జిమ్ లో కుస్తీలు పడుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.ఈ క్రమంలోనే ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీరితో పాటు సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ కుల్దీప్ సేథీ కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలను కుల్దీప్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న “లైగర్” అనే చిత్రంలో నటిస్తున్నారు. అదేవిధంగా రష్మిక సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప”సినిమాల్లోనూ, శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న “ఆడాళ్ళు మీకు జోహార్లు”అన్ని చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…