టాలీవుడ్ యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ ఇటీవల బైక్ యాక్సిడెంట్ లో గాయపడి.. 35 రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకొని.. దసరా పండుగ రోజు డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. అతడు ఇంటికి రావడంతో మెగా ఫ్యామిలీ అంతా ఎంతో సంతోషంలో ఉన్నారు. దీనికి సంబంధించి జనసేన కూడా ఓ ప్రెస్ నోట్ ను రిలీజ్ చేసింది. తేజు ఆరోగ్యంగా ఇంటికి రావాలని కోరుకున్న ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు అంటూ పవన్ కళ్యాణ్ తెలియజేశారు.
సాయి ధరమ్ తేజ్ ప్రేమకు సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఆ హీరోయిన్ ఎవరో కాదు.. లారిస్సా బోనెసి. బ్రెజిలియన్ మోడల్ కమ్ హీరోయిన్. తిక్క సినిమాలో సాయి తేజ్ కి జోడీగా నటించింది. ఆమెతో సాయికి ముడిపెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. దీనిపై ఆమె పెట్టే పోస్టులు కూడా దానికి బలాన్ని చేకూర్చినట్లు చేస్తోంది.
ఆ పోస్టులతోనే వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారా..అనే సందేహం కలుగుతోంది. సాయి తేజ్ యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ.. రిపబ్లిక్ మూవీ రిలీజ్ టైమ్ లో.. నా తేజు నటించిన రిపబ్లిక్ సినిమా ఈరోజు రిలీజ్ అవుతుందంటూ ఓ ట్వీట్ చేసింది. అలాగే ఐ మిస్ యూ తేజ్ అంటూ రీసెంట్ గా మరో ట్వీట్ చేసింది.ఇక తన ప్రేమను ఖరారు చేసేంత రేంజ్ లో ‘ఐ యామ్ ఇన్ లవ్’ అంటూ మరో ట్వీట్ చేసింది.
దీంతో సీన్ అంతా ప్రేక్షకులకు అర్థం అయిపోయింది. ఇంకేం లారిస్సా, సాయిధరమ్ తేజ్ తో లవ్ ఉందని కన్ఫార్మ్ చేసేశారు. ఇదే కనుక నిజమైతే మరి సాయి తేజ్, లారిస్సా ను పెళ్ళి చేసుకుంటాడా లేదా అనేది తెలియాలంటే సాయి తేజ్ స్పందించే వరకు వెయిట్ చేయాల్సిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…