Categories: FeaturedMovie News

S.A. Chandhra shekhar : నా కొడుకు నామీద కేసు పెట్టాడు…షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో విజయ్ తండ్రి…!

S.A. Chandhra shekhar : తమిళ సినిమా ఇండస్ట్రీ సూపర్ స్టార్ విజయ్ కు కోలీవుడ్ లోనే కాదు ఇటు సౌత్ మొత్తం ఫేమస్ హీరో. అటు నార్త్ లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. హీరో విజయ్ తండ్రి ఎస్ఏ చంద్ర శేఖర్ కూడా ఫేమస్ డైరెక్టర్. కొడుకును హీరోగా సక్సెస్ చేయడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. ఇక ఆయన తెలుగులో కూడా చిరంజీవి లాంటి హీరోలకు తొలినాళ్లలో పెద్ద హిట్లిచ్చారు. చట్టానికి కళ్ళు లేవు, దేవాంతకుడు వంటి సినిమాలతో చిరంజీవి కెరీర్ కు మంచి హిట్స్ ఇచ్చిన చంద్ర శేఖర్ గారు దాదాపు తమిళ, కన్నడ, తెలుగు తదితర భాషల్లో దాదాపు డెబ్భై సినిమాలను నిర్మించారు. ఆయన ఎక్కువగా సామాజిక సమస్యల మీద సినిమాలను తీయడం జరిగింది. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కొడుకు తో ఉన్న గొడవల గురించి మాట్లాడారు చంద్రశేఖర్.

నా కొడుకు నాపై కేసు పెట్టాడు….

చంద్ర శేఖర్ గారు తన ఫ్యామిలీ గురించి, మాట్లాడుతూ విజయ్ తో జరిగిన గొడవ గురించి మాట్లాడుతూ అందరి ఇళ్లలోనూ ఇలాంటివి ఉంటాయి. గొడవలు, మనస్పర్తలు లేకుండా ఏ ఇల్లు ఉండదు కానీ సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన వాళ్లం కాబట్టి మా విషయాలు అందరికి ఆసక్తికరంగా ఉంటాయి అంతే అంటూ చెప్పారు. చంద్ర శేఖర్ గారు పొలిటికల్ పార్టీ పెట్టినపుడు విజయ్ పేరును వాడుకోవడం విజయ్ అభిమాన సంఘాలతో చర్చలు జరపడం వంటి విషయాలలో విజయ్ దూరంగా ఉండటం మూలాన గొడవ జరిగి తన అనుమతి లేకుండా ఎవరు తన పేరును పొలిటికల్ పార్టీ కోసమో లేక ఒక ఆర్గనైజషన్ కోసం వాడకూడదు అంటూ పోలీస్ కేసు వేశారు విజయ్.

అయితే విజయ్ ఆ తరువాత తన తల్లిదండ్రులతో సఖ్యత గానే ఉన్నారు. ఇక ఈ విషయం గురించి మాట్లాడుతూ అలాంటి గొడవలు ఉంటాయి కానీ కుటుంబం అన్నాక అందరం కలిసే ఉంటాం. నా పిల్లలు ఏమి చేసిన నాకు ప్రేమ తగ్గదు అంటూ వివరించారు. అందరి ఇళ్లలో జరిగేవే అయిన విజయ్ పెద్ద హీరో కాబట్టి ఇలా వైరల్ అయింది న్యూస్ అయితే విజయ్ సోషల్మీడియా లో వచ్చే విషయాలను పెద్దగా పట్టించుకోడు అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago