Featured

S V Krishna Reddy & Achi Reddy : ఇరానీ చాయ్ హోటల్స్ కి ఆంధ్ర స్వీట్లు అమ్మకం నుండి… తెలుగు సినిమా టాప్ డైరెక్టర్ మరియు నిర్మాతలుగా ఎదిగిన ప్రస్థానం…!

S V Krishna Reddy : డాక్టర్ అవ్వాలనుకుని యాక్టర్ అయిన వల్ల గురించి తెలుసు. అలాగే యాక్టర్ అవ్వాలనుకుని డైరెక్టర్ అయిన టాప్ డైరెక్టర్ ఎస్వి కృష్ణా రెడ్డి. ఆయన గురించి చెప్పాలంటే ఆయన ప్రాణ మిత్రుడు అచ్చిరెడ్డి గురించి కూడా చెప్పాలి. రెండు దేహాలుగా ఉన్న ఇద్దరు మనుషులుగా వీళ్ళను వర్ణించవచ్చు. ఇక చదువుకునే రోజులనుండి ప్రాణ స్నేహితులుగా ఉన్న వీళ్లిదరు చదువయ్యాక సినిమాల్లోకి వెళ్లాలని అనుకున్నారు. మొదట్నుంచి హీరో అవ్వాలనుకున్నారు కృష్ణా రెడ్డి అందుకోసం చదువు అవ్వగానే మద్రాస్ రైలు ఎక్కారు.

ఇరానీ చాయ్ నుండి డబ్బింగ్ సినిమా ప్రొడ్యూసర్స్ గా…..

ఇక మద్రాస్ లో ఒక సినిమా, పగడాల పడవ అనే సినిమాలో రెండో హీరో అవకాశం మొదటగా కృష్ణా రెడ్డికి వచ్చింది. ఇక ఆ సినిమా మధ్యలో ఆగిపోవడం, ఆ తరువాత ఆశించినంత అవకాశాలు లేకపోవడంతో కృష్ణా రెడ్డి బాధపడ్డారు. ఆ సమయంలోనే అచ్చిరెడ్డి హైదరాబాద్ లో ఏదో ఒక వ్యాపారం చేసుకుని ఆ తరువాత సినిమాల్లోకి వెళదామని భరోసా ఇచ్చాడు. ఇక సినిమా పరిశ్రమ హైదరాబాద్ వచ్చింది. కృష్ణా రెడ్డి, అచ్చి రెడ్డి కూడా హైదరాబాద్ లో ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నారు అలా ముందుగా ఇరానీ చాయ్ హోటల్స్ కి ఆంధ్ర స్వీట్లు సప్లై చేయడం మొదలు, పిల్లలు తినే బొంగులు వరకు వ్యాపారాలు చేసి సక్సెస్ అయ్యారు. ఇక ఆ తరువాత పాత సినిమాలను మళ్ళీ డబ్బింగ్ చేసి రిలీజ్ చేసారు. ఇక పాత హిట్ సినిమా సర్వర్ సుందరంను మళ్ళీ డబ్బింగ్ చేసి విడుదల చేసి హిట్ కొట్టారు. ఆ తరువాత కొన్ని మలయాళం సినిమాలను డబ్బింగ్ చేసి ప్రొడ్యూసర్స్ గా లాభాలు పొందారు.

కొబ్బరి బొండాం తో మొదలైన అసలు సినీ ప్రస్థానం…..

ఇక రాజేంద్రప్రసాద్ హీరోగా కొబ్బరి బొండాం సినిమాకు కథా స్క్రీన్ ప్లే అందించారు కృష్ణా రెడ్డి. ఇక ఆ తరువాత రాజేంద్ర ప్రసాద్ హీరోగా మరోసారి రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా తీసి హిట్ కొట్టారు. ఈ చిత్రానికి దర్శకత్వం కృష్ణా రెడ్డి వహించారు. ఆ తరువాత మూడో సినిమా రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్‌లోనే మాయలోడు గా వచ్చి హ్యాట్రిక్ కొట్టారు. ఇక కుటుంబ కథా చిత్రాలకు మనీషా ఫిలిమ్స్ అచ్చిరెడ్డి, కృష్ణా రెడ్డి కేరాఫ్ గా నిలిచారు. శుభలగ్నం, మావిచిగురు, ఆహ్వానం వంటి కుటుంబ కథా చిత్రాలను ఒక మంచి సందేశంతో ముడిపెట్టి చూపించారు.

ఎస్వి కృష్ణా రెడ్డి గారిని హీరోగా చూడాలన్నది అచ్చిరెడ్డి గారి కల. అందుకే ఆయనను హీరోగా ఉగాది, అభిషేకం వంటి చిత్రాలను తీశారు. అలా ఇద్దరి ప్రస్థానంలో మంచి మైలు రాయి లాంటి చిత్రాలు ఎన్నో వచ్చాయి. తాజాగా మరోసారి చాలా గ్యాప్ తరువాత మెగా ఫోన్ పట్టుకున్నారు ఎస్వి కృష్ణా రెడ్డి గారు. బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా సినిమా తీస్తున్నారు. ఇక ఈటీవీలో యమలీల ఆ తరువాత అంటూ సీరియల్ తీస్తున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago