Featured

Thammareddy Bharadwaj : సూపర్ స్టార్ కృష్ణకు తమ్మారెడ్డికి మధ్య విభేదాలు.. సిల్క్ స్మితతో పాటే కారణం..!

Thammareddy Bharadwaj : తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నిర్మాత మరియు దర్శకుడైన తమ్మారెడ్డి భరద్వాజ గారికి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరుంది. తండ్రి తమ్మారెడ్డి కృష్ణమూర్తి కూడా డైరెక్టర్ గా మంచి సినిమాలను తీసారు. ఇక తమ్మారెడ్డి అనగానే కృష్ణ గారితో తీసిన పచ్చని సంసారం సినిమా గుర్తొస్తుంది. అయితే ఆ సినిమా తరువాత కృష్ణ గారితో చాలా రోజుల తరువాత మళ్ళీ సినిమా ప్లాన్ చేసారు, అదే రౌడీ అన్నయ్య. రౌడీ అన్నయ్య సినిమా కథ భరద్వాజది కాదు. కృష్ణ గారే భరద్వాజకు ఒకరి దగ్గర మంచి కథ ఉంది సినిమా చేద్దామని చెప్పడంతో కథ తీసుకోడానికి వెళితే, ఆయనే దేవి శ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి గారు.

సిల్క్ స్మితతో పాటలో కృష్ణ గారి పై కుట్ర….

ఇక సినిమా మొదలైనప్పటి నుండి సిల్క్ స్మిత పాట విషయంలో కృష్ణ గారితో వివాదం మొదలయింది. క్లైమాక్స్ లో సిల్క్ స్మిత పాట ఉంటుందని డిజైన్ చేశారట. కానీ పాట బాబు మోహన్ తో ఉండాలని తమ్మారెడ్డి భావించారు. కానీ కృష్ణ గారు చివర్లో వచ్చే పాటలో నేను లేకపోతే ప్రేక్షకులు ఒప్పుకోరని వాదించారు. ఇక సినిమా షూటింగ్ అంత పూర్తి అయినా పాటను మాత్రం పెండింగ్ పెట్టారట. చివరకు నిర్మాతతో కలిసి ఒక ప్లాన్ చేసారు తమ్మారెడ్డి.

పగలు కృష్ణ… రాత్రి బాబు మోహన్ తో సిల్క్ స్మిత పాట….

ఇక కృష్ణ గారితో పగలు సిల్క్ స్మిత పాట షూట్ చేసారు. ఆయనకు తెలియకుండా రాత్రికి బాబూమోహన్ తో పాటను షూట్ చేసారు. ఈ విషయం కృష్ణ గారికి తెలియకుండా మేనేజ్ చేసారు దర్శక నిర్మాతలు. అయితే సెన్సర్ విషయంలో పాటను తీసేయాలని చెప్పడంతో కృష్ణ గారే స్వయంగా సెన్సర్ బోర్డు మెంబెర్ సుబ్బిరామిరెడ్డిపై ఫైర్ అయ్యారట. తీరా చూస్తే పాటలో కృష్ణ గారి బదులుగా బాబూమోహన్ ఉండటంతో కృష్ణ గారికి బాగా కోపం వచ్చినా చాలా హుందాగా తమ్మారెడ్డి వద్దకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి మన ఫ్రెండ్ షిప్ ఎండ్ అయింది బాగా చేసావ్ అని అన్నారట.

ఆ తరువాత ఆ పాటను మళ్ళీ మూడో సారి కృష్ణ గారే స్వయంగా డైరెక్ట చేసారు. కానీ ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ మాత్రం తమ్మారెడ్డి ఆఫీస్ పై దాడి చేయడం ఆ తరువాత తమ్మారెడ్డి కేసు పెట్టడం వంటి రచ్చ ఒక సంవత్సరం పాటు కొనసాగింది. ఆ తరువాత తమ్మారెడ్డి గారు కృష్ణ గారితో మళ్ళీ కలిశారట. అలా కృష్ణ గారితో జరిగిన ఇష్యూపై క్లారిటీ ఇచ్చారు తమ్మారెడ్డి. అయితే ఆరోజు కృష్ణ గారే కరెక్ట్. ఒక మాస్ హీరో అయినా కమెడియన్ తో డాన్స్ ఏంటి అనుకున్నా కానీ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది లో బ్రహ్మానందంతో డాన్స్ చేసారు ఆ సన్నివేశం చూసినపుడు నాకు నా తప్పు అర్థమైందని చెప్పారు.

Bhargavi

Recent Posts

బిడ్డ ఎదుగుదలకు మసాజ్ ఎంత ముఖ్యమో తెలుసా?

నవజాత శిశువుల సంరక్షణలో మసాజ్ ఒక ముఖ్యమైన భాగంగా భావించబడుతోంది. భారతీయ కుటుంబాల్లో ఇది తరతరాలుగా కొనసాగుతున్న అలవాటు అయినప్పటికీ,…

10 minutes ago

డ్రీమ్ హీరోకి చెల్లెలిగా నటించలేను.. ఆమని సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ రంగంలో తన సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన నటి ఆమని, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర…

2 hours ago

పిల్లలకు బెస్ట్ హెల్తీ స్వీట్ ఐడియా ఇదే.. పాలు, బెల్లంతో సూపర్ టేస్ట్.. సింపుల్ హోమ్ రెసిపీ!

ఇంట్లోనే తక్కువ పదార్థాలతో, ఆరోగ్యానికి మేలు చేసే స్వీట్లు తయారు చేయడం ఇటీవలి కాలంలో మళ్లీ ట్రెండ్‌గా మారుతోంది. ముఖ్యంగా…

5 hours ago

నిద్రలో లేచి తింటున్నారా? సాధారణమా లేక ఆరోగ్య సమస్యా?

అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా ఆకలి వేయడం చాలా మందికి ఎదురయ్యే సాధారణ అనుభవం. రోజంతా సరైన సమయానికి భోజనం చేసినప్పటికీ…

5 hours ago

వేసవిలో శరీరానికి కూలింగ్ కావాలా?దాహం, అలసటకు పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇదే!

వేసవి మొదలైనప్పుడే శరీరం చల్లదనం కోసం తపిస్తుంది. ఈ కాలంలో మార్కెట్‌లో లభించే పండ్లలో మామిడి, పుచ్చకాయ ప్రత్యేక స్థానం…

5 hours ago

ఖాళీ కడుపుతో వాకింగ్.. నిజంగా మంచిదేనా?

దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత కనిపిస్తున్న నేపథ్యంలో చాలా మంది తమ…

6 hours ago